గుండెపోటుతో టెన్త్‌ విద్యార్థిని మృతి.. పదో తరగతి పరీక్ష రాసిన తర్వాత..

ఓ విద్యార్థిని గుండెపోటుతో మృతి చెందడం విషాధంగా మారింది. ఈ ఘటన కడప జిల్లాలోని పొద్దుటూరు నియోజకవర్గంలో చోటుచేసుకుంది. మొదటి పరీక్ష

Update: 2024-03-19 13:36 GMT

Heart Attack

ఓ విద్యార్థిని గుండెపోటుతో మృతి చెందడం విషాధంగా మారింది. ఈ ఘటన కడప జిల్లాలోని పొద్దుటూరు నియోజకవర్గంలో చోటుచేసుకుంది. మొదటి రోజే టెన్త్ పరీక్ష రాసి స్కూల్‌కి వెళ్ళిన ఆ విద్యార్థిని తోటి విద్యార్థులతో మాట్లాడుతూ కుప్పకూలిపోయింది. ఇది చూసిన తోటి విద్యార్థులంతా దిగ్భ్రాంతికి గురయ్యారు.

గుండెపోటుతో టెన్త్ విద్యార్థిని మృతి చెందడంతో కడప జిల్లాలో విషాదఛాయలు అలముకున్నాయి. రాజుపాలెం మండలంలోని కొర్రపాడులో టెన్త్ విద్యార్థిని లిఖిత (15) గుండెపోటుతో మృతి చెందింది. ఇటివలె మొదలైన పదోవ తరగతి తెలుగు పరీక్ష రాసిన తర్వాత తోటి విద్యార్దులతో పాఠశాలకు వెళ్ళిన లిఖిత విద్యార్దులతో కలిసి మధ్యాహ్నం భోజనం చేసి మాట్లాడుతూ కుప్పకూలి పోయింది. వెంటనే స్పందించిన పాఠశాల యాజమాన్యం దగ్గరలోని ఆస్పత్రికి తీసుకెళ్ళినా ఫలితం లేకపోయింది. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ప్రొద్దుటూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకురావడంతో అప్పటికే విద్యార్దిని లిఖిత మరణించినట్లు వైద్యులు తెలిపారు. దీంతో తోటి విద్యార్దుల , పాఠశాల యాజమావ్యం , తల్లిదండ్రులు ధిగ్బ్రాంతికి గురైయ్యారు.

అప్పటి వరకు సంతోషంగా ఉండి ఒక్కసారి కుప్పకూలిపోవడంతో తోటి విద్యార్థులు జీర్ణించుకోలేకపోతున్నారు. లిఖిత మృతితో విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే తల్లిదండ్రులు చెప్పిన వివరాల ప్రకారం లిఖితకు చిన్నతనం నుంచే గుండెకు సంబంధించిన సమస్యలు ఉన్నాయని తెలిపారు. అయితే లిఖిత పదవతరగతి పరీక్షల మొదటి రోజే తెలుగు పరీక్ష ఒక్కటే రాసి కానరాని లోకాలకు వెళ్లిపోయింది.

Tags:    

Similar News