Weather Report : క్యుములోనింబస్ మేఘాలు.. వానలు ఇక్కడే కురుస్తాయట

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నేడు కూడా వానలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.

Update: 2025-11-08 03:49 GMT

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నేడు కూడా వానలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి, ఆగ్నేయ దిశ నుంచి బలమైన గాలులు వీచే అవకాశముందని తెలిపింది. అయితే రెండు రాష్ట్రాల్లో నేడు తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని పేర్కొంది. తెలంగాణలో క్యుములోనింబస్ మేఘాల కారణంగా వానలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అదే సమయంలో పగటి పూట ఉష్ణోగ్రతలు కొంత పెరిగే అవకాశముందని, 30 డిగ్రీల ఉష్ణోగ్రతలు పలు చోట్ల నమోదవుతాయని, మరికొన్ని చోట్ల మాత్రం జల్లులు పడతాయని వెల్లడించింది.

పిడుగులు పడే ప్రాంతాల్లో...
ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు కూడా వానలు పడతాయని అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రమే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశముందని కూడా హెచ్చరించింది. రైతులు, కూలీలు, పశువుల కాపర్లు పొలాలకు వెళ్లిన సమయంలో చెట్ల కింద నిలబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. రాయలసీమ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో వానలు పడతాయని పేర్కొంది. అలాగే ఉత్తరాంధ్రలో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు పడతాయని కూడా చెప్పింది.
నేడు తెలంగాణలో...
తెలంగాణలోనూ నేడు వానలు పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. క్యుములో నింబస్ మేఘాల ప్రభావంతో వానలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, కరీంనగర్ వంటి జిల్లాల్లో తేలిక పాటి వర్షాలు పడతాయని, నాగర్ కర్నూలు, ఖమ్మం జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ నగరంలోనూ తేలికపాటి జల్లులు పడే అవకాశముందని చెప్పింది. నైరుతి బంగాళాఖాతం నుంచి ఉత్తర కేరళ వరకూ తమిళనాడు మీదుగా ఆవర్తన ద్రోణి కొనసాగుతుందని, ఈ ప్రభావంతో తేలికపాటి జల్లులు పడే అవకాశముందని పేర్కొంది. పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ను వాతావరణ శాఖ జారీ చేసింది.





Tags:    

Similar News