Andhra Pradesh : నేడు ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలకం
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాం కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై నేడు విచారణ జరగనుంది
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాం కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై నేడు విచారణ జరగనుంది. ఈకేసులో నిందితులైన రాజ్ కేసిరెడ్డి, సజ్జల శ్రీధర్‌రెడ్డి, చాణక్య,బెయిల్ పిటిషన్లపై ఏసీబీ కోర్టు ఇవ్వనుంది. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వెంకటేష్, బాలాజీ, నవీన్ బెయిల్ పిటిషన్‌పై ఏసీబీ కోర్టు నేడు తీర్పు చెప్పనుంది. సిట్ అధికారులు మాత్రం వీరికి బెయిల్ ఇవ్వవద్దని కోరుతున్నారు.
ఏసీబీ కోర్టులో...
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే ఏసీబీ కోర్టు ఐదుగురికి బెయిల్ మంజూరు చేసింది. అయితే సిట్ అధికారులు వారికి ఏసీబీ కోర్టు బెయిల్ ఇవ్వడంపై హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో నేడు ఏసీబీ కోర్టు మిగిలిన నిందితుల విషయంలో బెయిల్ పిటీషన్లపై ఎలాంటి తీర్పు చెప్పనుందన్నది ఆసక్తికరంగా మారింది. సిట్ మాత్రం బెయిల్ ఇవ్వవద్దంటూ వాదించింది.