Big Breaking :శ్రీకాకుళం జిల్లాలో విషాదం... ఆలయంలో తొక్కిసలాట 9 మంది మృతి

శ్రీకాకుళం జిల్లాలో విషాదం జరిగింది. కాశీబుగ్గ వెంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగి 9 మంది మరణించారు

Update: 2025-11-01 06:41 GMT

శ్రీకాకుళం జిల్లాలో విషాదం జరిగింది. కాశీబుగ్గ వెంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగి 9 మంది మరణించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని తెలిసింది. అనేక మంది గాయపడ్డారు. కార్తీక మాసం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలి వచ్చారు. దీంతో ఒక్కసారిగా జరిగిన తొక్కిసలాటతో తొమ్మిది మంది మరణించారని తెలిసింది. మృతుల్లో ఎక్కువమంది మహిళలున్నారని సమాచారం. ఆలయంలోకి వచ్చే మార్గం, వెళ్లే మార్గం ఒక్కటే కావడంతో ఈ దుర్ఘటన జరిగింది. రెయిలింగ్ విరగిపడటంతో ఈ ప్రమాదం జరిగిందని తెలిసింది.

కార్తీక మాసం కావడంతో...
కార్తీకమాసం కావడం.. శనివారం .. ఏకాదశి కావడంతో తొక్కిసలాట జరిగి ఈ ప్రమాదం జరిగింది. అక్కడ సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో పాటు తగిన బందోబస్తు ఏర్పాటు చేయకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ఆలయ అధికారుల నిర్లక్ష్యం కూడా కనిపిస్తుంది. అనేక మంది గాయపడ్డారు. ఒక్కసారిగా ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో తోపులాట జరిగి మరణించారని తెలిసింది. అనేక మంది గాయపడ్డారు. గాయపడిన వారిని పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.


Tags:    

Similar News