Chandrababu : నేడు పార్టీ కార్యాలయానికి చంద్రబాబు

నేడు చంద్రబాబు మంగళగిరిలోని పార్టీకేంద్ర కార్యాలయానికి రానున్నారు

Update: 2025-12-06 03:04 GMT

ఈరోజు మధ్యాహ్నం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజలు, కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించనున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు పార్టీ కార్యాలయానికి వస్తున్నారని తెలిసి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో పార్టీ కార్యాలయానికి కార్యకర్తలు తరలి వస్తున్నారు. తమ సమస్యలను చెప్పుకునేందుకు బారులు తీరారు.

ప్రజల నుంచి వినతులు...
ప్రతి నెలలో శనివారం నాడు చంద్రబాబు పార్టీ కార్యాలయానికి వస్తారు. పార్టీ కార్యకర్తల నుంచి మాత్రమే కాకుండా అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో తరలి వస్తుండటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చంద్రబాబు నాయుడు ప్రజల నుంచి వినతులను స్వీకరించడమే కాకుండా పార్టీ నేతలతోనూ సమావేశమై చర్చించనున్నారు. దీంతో పార్టీ ముఖ్య నేతలు కూడా పార్టీ కార్యాలయానికి చేరుకుంటున్నారు.


Tags:    

Similar News