IPL 2024 : ఈ మ్యాచ్ కు అతితక్కువ రేటింగ్.. టీవీలు ఆఫ్ చేశారట ...చూసేవాళ్లు కొద్దిమందేనట

పంజాబ్ కింగ్స్ తో గుజరాత్ టైటాన్స్ జరిగిన మ్యాచ్ లో టైటాన్స్ విజయం సాధించింది

Update: 2024-04-22 04:28 GMT

ప్రతి ఆదివారం క్రికెట్ ఫ్యాన్స్ కు రెండు మ్యాచ్ లు జరుగుతూ అలరిస్తుంటాయి. ఐపీఎల్ అంటేనే టెన్షన్ పెడుతూ చివరి బంతి వరకూ విజయం ఎవరిదో కూడా తేలని పరిస్థితి ఉంటుంది. అందుకే ఐపీఎల్ పదిహేడు సీజన్లయినా అంత హిట్టవుతుంది. ఇంకా ఎన్ని సీజన్లు అయినా అంతే. విజయం ఎవరిని వరిస్తుందన్న ఉత్కంఠ చివరి బంతి వరకూ సాగడం అనేక మ్యాచ్ లలో చూశాం. నిన్న బెంగలూరు రాయల్ ఛాలెంజర్స్, కోల్‌కత్తా నైట్ రైడర్స్ మ్యాచ్ కూడా ఇదే జరిగింది. చివరకు కేకేఆర్ ఒక పరుగుతో విజయం సాధించింది. అయితే మరో మ్యాచ్ పంజాబ్ కింగ్స్ తో గుజరాత్ టైటాన్స్ జరిగిన మ్యాచ్ వన్ సైడ్ గానే జరిగింది. అందుకే ఈ మ్యాచ్ రేటింగ్ కూడా పెద్దగా రాలేదంటున్నారు.

అతితక్కువ మంది...
ఎక్కువ మంది పంజాబ్ కింగ్స్ తో గుజరాత్ టైటాన్స్ జరిగిన మ్యాచ్‌ను చూడకుండానే టీవీలను ఆఫ్ చేయడంతో టీఆర్పీ రేటింగ్ కూడా చాలా తక్కువగా ఈ మ్యాచ్ కు నమోదయిందని చెబుతున్నారు. ఎందుకంటే ఈ మ్యాచ్ లో ముందుగానే విజయం ఎవరిదో తేలిపోయింది. దీంతో పెద్దగా ఫ్యాన్స్ కూడా ఆసక్తికనపర్చలేదు. నిద్రపట్టని వారు ఎవరో అరకొర చూశారు తప్పించి మ్యాచ్ ను వీక్షించిన వాళ్లు తక్కువేనని, ఐపీఎల్ లో అతి తక్కువగా వీక్షించిన మ్యాచ్ ఇదేనన్న విశ్లేషణలు వినపడుతున్నాయి. తక్కువ స్కోరు చేయడంతో దానిని అధిగమించడం ప్రత్యర్థి జట్టుకు సునాయాసంగా మారడం కూడా టీఆర్పీ రేటింగ్ తగ్గడానికి కారణమని చెబుతున్నారు.
అతి తక్కువ పరుగులు...
పంజాబ్ కింగ్స్ తో గుజరాత్ టైటాన్స్ జరిగిన మ్యాచ్ లో టైటాన్స్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 142 పరుగులు మాత్రమే చేసింది. టైటాన్స్ బౌలర్ల దెబ్బకు కింగ్స్ కుదేలయి పోయారు. ప్రభమన్‌సింగ్ ఒక్కడే 35 పరుగులు చేయగలిగాడు. ఇక వచ్చిన వారు వచ్చినట్లు వెళ్లిపోయాడు. దీంతో పంజాబ్ కింగ్స్ ఇరవై ఓవర్లలో ఆల్ అవుట్ అయి కేవలం 142 పరుగులు మాత్రమే చేసింది. మిగిలిన జట్లన్నీ 200 దాటిస్తూ ప్రత్యర్థికి చుక్కలు చూపుతూ మ్యాచ్ లో టెన్షన్ క్రియేట్ చేస్తున్న దశలో పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు ఒకరివెంట ఒకరు అవుట్ అయిపోయి ఫ్యాన్స్ ను నిరాశలోకి నెట్టేశారు.
చిన్న లక్ష్యం కావడంతో...
ఆ తర్వాత 143 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ కు ఇది పెద్ద స్కోరు కాదు. సాహా పదమూడు పరుగులు చేశాడు. గిల్ 35 పరుగులు చేవాడు. సాయి సుదర్శన్ 31 పరుగులు చేశాడు, అజ్మతుల్లా పదమూడు, తెవాతియా 36 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే గుజరాత్ టైటాన్స్ తన లక్ష్యాన్ని సాధించింది. పంజాబ్ కింగ్స్ ఈ మ్యాచ్ లో ఓటమి పాలయి ప్లేఆఫ్ ను చేరుకునే దశను మరింత సంక్లిష్టం చేసుకుంది. అందుకే గిల్ ఆడుతున్న సమయంలోనే అందరూ టీవీలు కట్టేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. చిన్న స్కోరు కావడంతో గుజరాత్ టైటాన్స్ ఊదిపారేసింది.




Tags:    

Similar News