IPL 2024 : మ్యాచ్ మలుపు తిప్పింది అదే.. స్కోరు చిన్నదైనా.. చెమటోడ్చారే

పంజాబ్ కింగ్స్ పై రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో పంజాబ్ పోరాటాన్ని కూడా అభినందించకుండా ఉండలేం.

Update: 2024-04-14 04:08 GMT

నిన్న పంజాబ్ కింగ్స్ తో జరిగిన రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. లక్ష్యం చిన్నదే.. అయితే మాత్రం ఏం... ఫ్యాన్స్ ను కుర్చీలో కూర్చోనివ్వకుండా చేసింది. రెండు జట్లు బౌలర్లు విజృంభించడంతోనే మ్యాచ్ ఈ రకంగా సాగిందని చెప్పాలి. ఎందుకంటే.. బ్యాటర్లు రెండుజట్లలో పెద్దగా షాట్లు కొట్టింది లేదు. అందుకే ఈ మ్యాచ్ మాత్రం బౌలర్లదేనని చెప్పాలి. చివరకు పంజాబ్ కింగ్స్ పై రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో పంజాబ్ పోరాటాన్ని కూడా అభినందించకుండా ఉండలేం.

పాయింట్ల పట్టికలో...
రాజస్థాన్ రాయల్స్ మరో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. తన ఫామ్ ను కొనసాగిస్తూనే ఉంది. మూడు వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ కేవలం 147 పరుగులు మాత్రమే చేసింది. రాజస్థాన్ రాయల్స్ మరో బంతి మిగిలి ఉండగానే ఏడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. రాజస్థాన్ రాయల్స్ లో యశస్వి జైశ్వాల్ 39, హెట్ మయర్ 27 పరుగులు అత్యధిక స్కోర్లు చేసి రాణించడంతో జట్టుకు విజయం సాధ్యమయింది.
లక్ష్యం ఏమంత పెద్దది కాకున్నా...
తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ జట్టు ఆది నుంచి తడబాటు పడింది. పరుగు చేయడమే కష్టంగా మారింది. ఫోర్లు, సిక్సర్లు చాలా స్వల్పం అనే చెప్పాలి. శిఖర్ ధావన్ గాయం కారణంగా ఈ మ్యాచ్ ఆడలేదు. అశుతోష్ కారణంగానే 147 పరుగులు చేయగలిగింది. అయితే ఆ లక్ష్యాన్ని చేరుకోవడంలో తడబడి నిలబడిన రాజస్థాన్ తిరిగి తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంది. కేశవ్ మహారాజ్ రెండు కీలక వికెట్లు తీసి జట్టు విజయానికి దోహదపడ్డాడు. మొత్తం మీద గత మ్యాచ్ లో ఓడిన రాజస్థాన్ రాయల్స్ ఈ మ్యాచ్ లో గెలిచి తనకు తిరుగులేదని నిరూపించుకుంది.


Tags:    

Similar News