IPL 2024 : నిజంగానే జెర్సీ మార్చగానే అదృష్టం మామూలుగా పట్టలేదుగా.. లేదంటే ఈ విజయాలేంటి?

హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగిన చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్ ఏకపక్షంగా సాగింది.

Update: 2024-04-06 04:15 GMT

హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగిన చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్ ఏకపక్షంగా సాగింది. ఏ దశలోనూ విజయం చెన్నై పక్షాన మొగ్గు చూపలేదు. సన్ రైజర్స్ విజయం ఖాయమని ముందుగానే తేలిపోయింది. పెద్దగా ఉత్కంఠ లేని మ్యాచ్ హైదరాబాద్ వాసులను మాత్రం అలరించిందనే చెప్పాలి. ఎందుకంటే చివర్లో అయినా ధోనీ మైదానంలోకి దిగి బ్యాట్ ను అలా ఝుళిపించి వెళ్లడంతో కేవలం థోని కోసమే వచ్చిన ఫ్యాన్స్ కు కూడా ఆ కొరత తీరిందనే చెప్పాలి. సన్ రైజర్స్ దూకుడు మీదుంది. ఇప్పటికి నాలుగు మ్యాచ్ లు ఆడి రెండు మ్యాచ్ లలో గెలిచి పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో నిలిచింది.

దూబే దూకుడుగా...
తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు ఉప్పల్ స్టేడియంలో ఊదిపారేస్తుందని భావిస్తే పెద్దగా రన్స్ చేయలేకపోయింది. సన్ రైజర్స్ బౌలర్లు కట్టడితో బౌలర్లు చేశారు. చెన్నై సూపర్ కింగ్స్ లో ఒక శివమ్ దూబే ఒక్కడే చెలరేగి ఆడాడు. శివమ్ దూబే నలభై ఐదు పరుగులు చేశాడు. దూబే అవుట్ అయిన తర్వాత స్కోరు నత్తనడకన సాగింది. తర్వాత రహానే 35 పరుగులు చేసి పరవాలేదనిపించాడు. చివరిలో వచ్చిన జడేజా నాటౌట్ గా నిలిచి 31 పరుగులు చేశాడు. అయితే మొత్తం ఇరవై ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 165 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ స్కోరు ను చూసిన వాళ్లకు ఎవరైనా ఐపీఎల్ లో ఇది పెద్దస్కోరు కాదని తెలుసు. కానీ చెన్నై సూపర్ కింగ్స్ మాయ చేస్తారేమోనని భావించారు.
పెద్దగా ఉత్కంఠ లేకుండానే...
కానీ ఏ మాయ జరగలేదు. ఈ మంత్రమూ పనిచేయలేదు. ఓపెనర్లుగా దిగిన హెడ్, అభిషేక్ శర్మ కొద్దిసేపు జట్టు స్కోరును పరుగులు తీయించారు. హెడ్ 31, అభిషేక్ శర్మ 37 పరుగులు చేశారు. అప్పుడే సన్ రైజర్స్ విజయంపై ఎవరికీ డౌట్ కలగలేదు. మార్‌క్రమ్ అర్ధసెంచరీ పూర్తి చేసి రైజర్స్ కు విజయాన్ని అందించాడు. దీంతో ఆరు వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ మీద సన్ రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది. కేవలం 18.1 ఓవర్లలోనే కధను ముగించారు. ఇంతటి సునాయాస విజయాన్ని ఎవరూ ఊహించలేదు. చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్ లో వరసగా ఢిల్లీ కాపిటల్స్, సన్ రైజర్స్ పై ఓటమి పాలు కావడంతో దాని అభిమానులు నిరాశలో మునిగిపోయారు.



Tags:    

Similar News