IPl 2024 : ఏమి ఫిట్ నెస్ సామీ... ధోనీ...ఆహారపు అలవాట్లు ఏంటి.. నెట్టింట సెర్చింగ్

మహేంద్ర సింగ్ ధోనీ ఆహార అలవాట్లపై నెట్ లో ఎక్కువ సంఖ్యలో యువత సెర్చ్ చేస్తున్నారు

Update: 2024-04-15 03:09 GMT

మిగిలి ఉన్నది నాలుగు బంతులు.. మహేంద్ర సింగ్ ధోని క్రీజులోకి వచ్చాడు. అయితే వయసు మీద పడటం కావచ్చు.. అన్ని ఫార్మాట్లలో రిటైర్మెంట్ కావడం కావచ్చు... పెద్దగా ఫాం లో లేకపోవడం కావచ్చు.... ఇలా కారణాలు ఏవైనా .. ధోని నుంచి నాలుగు బంతులకు పెద్దగా పరుగులు ఆశించారు. కాకుంటే ధోనీ బ్యాట్ పట్టుకుని వస్తే చూద్దామని లక్షల సంఖ్యలో అభిమానులు ఎదురు చూస్తుంటారు. థోని వీరబాదుడు చూద్దామని కాదు కానీ.. ఒక్కసారి ఆ జెర్సీలో బ్యాట్ చేత్తో పట్టుకుని క్రీజులో నిల్చుంటే చూద్దామనుకునే కళ్లకోసమేనన్నట్లు ధోని వచ్చాడు.

చివరి నాలుగు బంతుల్లో...
నిన్న ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఇదే జరిగింది. అప్పటికే రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబే బాగా ఆడినప్పటికీ చివరి నాలుగు బంతులు మిగిలి ఉండగా మిచెల్ అవుట్ కావడంతో జడేజా వస్తాడని భావించారు కానీ అనూహ్యంగా ధోని వచ్చేశాడు. ఇక ఫ్యాన్స్ కు పండగే పండగ. ధోనీని బ్యాటుతో చూద్దామన్న అభిమానుల కలనేరినే వేళ స్టేడియం మొత్తం ఆ నామ స్మరణతో మారుమోగిపోయింది. ధోనీ.. ధోనీ.. అంటూ స్టేడియం మొత్తం చేస్తున్న నినాదాల మధ్య అస్సలు కామెంటరీ కూడా వినిపించడం మానేసింది.
ఊహించినట్లుగానే..
అయితే ఫ్యాన్స్ ఊహించినట్లుగానే ధోనీ తన బ్యాట్ కు పని చెప్పాడు. నాలుగు బంతుల్లో 20 పరుగులు చేశాడు. అందులో మూడు సిక్సర్లు ఉన్నాయంటే ఇక ఊహించుకోండి. ధోని జబ్బల సత్తా ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తొలి మూడు బంతులకు వరసగా మూడు సిక్సర్లు బాదిన ధోని తర్వాత బంతికి రెండు పరుగులు చేసి ఇరవై పరుగులు చేశాడు. దీంతో ముంబయి ఇండియన్స్ ముందు లక్ష్యాన్ని ధోనీ వీరవిహారంతో 206 పరుగులు చేశాడు. అదీ ధోనీ అంటే.. మహేంద్రుడికి ఇప్పటికీ ఫ్యాన్స్ ఉన్నారంటే అదే కారణం. దీంతో ఈ వయసులోనూ సిక్సర్లు బాదుతున్న ధోని ఆహారపు అలవాట్లను తెలుసుకునేందుకు నెట్ లో ఎక్కువ మంది సెర్చ్ చేస్తున్నారు. ధోని ఫిట్‌నెస్ గురించి తెలుసుకోవాలన్న ఆసక్తిని కనపరుస్తున్నారు.
Tags:    

Similar News