IPL 2024 : ఛేజింగ్ లో బ్యాటర్లు క్లిక్ అయితేనే విజయం.. అందుకే.. ముంబయి ఓటమి

ముంబయి ఇండియన్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ సూపర్ విక్టరీ సాధించింది. రోహిత్ శర్మ సెంచరీ వృధా అయింది

Update: 2024-04-15 03:27 GMT

నిన్న జరిగిన చెన్నై సూపర్ కింగ్స్.. ముంబయి ఇండియన్స్ మ్యాచ్ చూసిన వారికి ఎవరికైనా సులువుగా ముంబయిదే విజయమని అనుకుంటారు. ఎందుకంటే రెండు వికెట్లు కోల్పోయి 124 పరుగులు చేసింది. ఇంకా ఏడు ఓవర్లలో 83 పరుగులు చేయాల్సి ఉంది. అదేమీ పెద్ద లక్ష్యమేమీ కాదు. కానీ ముంబయి ఓటమిపాలయింది. దానికి కారణం చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ల పెర్‌ఫార్మెన్స్ అనుకోవాలా? అనేది తెలియదు కానీ.. ఖచ్చితంగా ముంబయి ఇండియన్స్ బ్యాటర్ల విఫలమని చెప్పక తప్పదు.

బ్యాటర్లు విఫలం కావడంతో...
ఒత్తిడిని తట్టుకోలేక ఓటమివైపు జట్టును పయనించేలా బ్యాటర్లు చేశారు. రోహిత్ శర్మ సెంచరీ చేసినప్పటికీ అది చివరకు వృధాగానే మారింది. ముంబయి ఇండియన్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ సూపర్ విక్టరీ సాధించింది. పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది. అంటే చెన్నై ఇక జాగ్రత్తగా ఆడితే ప్లే ఆఫ్ కు చేరుకున్నట్లే. అందుకే ఐపీఎల్ లో తొలి ఓవర్ నుంచి చివరి ఓవర్ వరకూ బ్యాటర్లు క్లిక్ అయితేనే విజయం వరిస్తుందన్నది మరోసారి రుజువయింది.
తొలుత బ్యాటింగ్ చేసి...
తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై ఇరవై ఓవర్లకు 206 పరుగులు చేసింది. ఇందులో రహానే ఐదు పరుగులకే అవుట్ కాగా, రచిన్ 21పరుగులు చేసి పరవాలేదనిపించుకున్నాడు. రుతురాజ్ గైక్వాడ్ మరోసారి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి 69 పరుగులు చేశాడు. ఇక ఎప్పటిలాగానే శివమ్ దూబే పూనకాలు లోడింగ్ అంటూ మంచి పెర్‌ఫార్మెన్స్ చేసి 66 పరుగులు చేశాడు. చివరిలో వచ్చిన ధోనీ నాలుగు బంతులకు ఇరవై పరుగులు చేసి జట్టుకు 206 పరుగులు తెచ్చాడు. కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి చెన్నై ఆ స్కోరును సాధించింది.
రోహిత్ శర్మ నాటౌట్ గా....
తర్వాత ఛేదనలో బరిలోకి దిగిన ముంబయి ఇండియన్స్ ఆదిలో బాగానే ఆడింది. రోహిత్ శర్మ సూపర్ పెర్‌ఫార్మెన్స్ తో ముంబయి జట్టుకు గెలుపు తప్పదని అందరూ అనుకున్నారు. ఎందుకంటే రోహిత్ శర్మ 105 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇషాన్ కిషన్ 23 పరుగులు చేసి అవుటయ్యాడు. సూర్యకుమార్ మళ్లీ డకౌట్ అయి నిరాశపర్చాడు. హార్ధిక్ పాండ్యా రెండు పరుగులు చేసి వెనుదిరిగాడు. ఇక వరస బెట్టి టిమ్ డేవిడ్, షెఫర్డ్ అవుట్ కావడంతో రోహిత్ శర్మ సెంచరీ చేసి జట్టును గెలిపించాలన్న ప్రయత్నాన్ని మిగిలిన ఆటగాళ్లు మాత్రం నిలబడలేక నీరుగార్చి పారేశారు.


Tags:    

Similar News