Ukraine War : వస్తున్న ఏపీ విద్యార్థులు ముగ్గురే

ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులను తీసుకుని విమానం బయలుదేరింది

Update: 2022-02-26 11:54 GMT

ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులను తీసుకుని విమానం బయలుదేరింది. విద్యార్థులను తిరిగి రప్పించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది. ఈ టాస్క్ ఫోర్స్ కమిటీ కి నేతృత్వం వహిస్తున్న కృష్ణబాబు ఉక్రెయిన్ లోని ఏడు యూనివర్సిటీలో 423 మంది విద్యార్థులు మెడిసిన్ చదువుతున్నట్లు గుర్తించామని చెప్పారు. అయితే తొలుత ఈ రోజు బయలుదేరిన విమానంలో 13 మంది ఏపీ విద్యార్థులు వస్తున్నట్లు తమకు సమాచారం తొలుత అందిందని చెప్పారు.

విమానం బయలుదేరిన తర్వాత....
కానీ ఇప్పుడు విమానం బయలుదేరిన తర్వాత అందిన సమాచారం మేరకు కేవలం ముగ్గురు ఏపీ విద్యార్థులే ఉక్రెయిన్ నుంచి వస్తున్నారని చెప్పారు. ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఏపీ ప్రభుత్వం హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసిందన్నారు. ఏపీ విద్యార్థులను సరిహద్దులకు వెళ్లవద్దని సూచించామని చెప్పారు. ఉక్రెయిన్ లో ఉన్న ఏపీ విద్యార్థులు తమతో టచ్ లో ఉన్నారని, వారిని తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. ఢిల్లీకి వచ్చే ఏపీ విద్యార్థులను తొలుత ఏపీభవన్ కు తరలిస్తామని, అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఆంధ్రప్రదేశ్ కు తీసుకువస్తామని ఆయన తెలిపారు.


Tags:    

Similar News