15 కి.మీ ల దూరంలో రష్యా సేనలు

ఉక్రెయిన్ పై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. రాజధాని కీవ్ కు కేవలం పదిహేను కిలోమీటర్ల దూరంలో రష్యా సేనలున్నాయి

Update: 2022-03-16 02:41 GMT

ఉక్రెయిన్ పై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఉక్రెయిన్ రాజధాని కీవ్ కు కేవలం పదిహేను కిలోమీటర్ల దూరంలో రష్యా సేనలున్నాయి. అవి వేగంగా కీవ్ వైపు కదులుతున్నాయి. దాదాపు 19 రోజుల నుంచి యుద్దం జరుగుతున్నా రష్యా సేనలు కీవ్ నగరాన్ని స్వాధీనం చేసుకోలేకపోవడంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కొందరు అధికారులపై వేటు కూడా వేశారు. దీంతో రష్యా సేనలు బాంబుదాడులతో కీవ్ నగరంపై విరుచుకుపడుతున్నాయి.

క్షిపణులతో దాడులు....
రష్యా క్షిపణులతో దాడులకు దిగుతుండటంతో నివాస భవనాలు కూడా నేలమట్టం అవుతున్నాయి. ఒక అపార్ట్ మెంట్ పైన క్షిపణి దాడి జరగడంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. అలాగే యూనివర్సిటీపై కూడా రష్యా సేనలు దాడిగి దిగాయి. ఈ ఘటనలో పది మంది ప్రాణాలు కోల్పోయారు. ఉక్రెయిన్ దేశంలోని ప్రధాన నగరాలు బాంబుల మోతతో దద్దరిల్లిపోతున్నాయి.


Tags:    

Similar News