ఆగని బాంబు దాడులు.. నగరాలే లక్ష్యంగా?

కీవ్ నగరంతో పాటు మరిన్ని నగరాలను లక్ష్యంగా చేసుకుని రష్యా బాంబు దాడులు జరుపుతుంది

Update: 2022-03-20 04:16 GMT

ఉక్రెయిన్ పై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. రాజధాని కీవ్ నగరంతో పాటు మరిన్ని నగరాలను లక్ష్యంగా చేసుకుని రష్యా బాంబు దాడులు జరుపుతుంది. కీవ్ తో పాటు ప్రధాన నగరాలన్ని బాంబుల మోతతో దద్దరిల్లిపోతున్నాయి. పౌరులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటకు పరుగులు తీస్తున్నారు. ప్రధాన నగరాలను స్వాధీనం చేసుకోవాలన్న రష్యా లక్ష్యానికి ఉక్రెయిన్ సేనలు సమర్థవంతంగా అడ్డుకుంటున్నాయి. తొలిసారి హైపర్ సోనిక్ క్షిపణిని రష్యా ప్రయోగించింది.

మానవతా క్యారిడార్లు....
అయితే పౌరులను తరలించడానికి పది మానవతా క్యారిడర్లను ఏర్పాటు చేశారు. యుద్ధం జరిగే ప్రాంతం నుంచి పౌరులను తరలించడానికి ఈ క్యారిడార్లను ఏర్పాటు చేశారు. ఖర్కీవ్, మరియపోల్ నగరాలలో మొత్తం పది క్యారిడార్లను ఏర్పాటు చేసినట్లు ఉక్రెయిన్ ప్రభుత్వం తెలిపింది. బాంబుదాడులలో అనేక మంది ఉక్రెయిన్ సైనికులు మరణించినట్లు తెలిసింది.


Tags:    

Similar News