Ukraine War : ఖననం చేయడానికి సమయం లేదే?

రష్యా - ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. భీకర దాడులు జరుగుతున్నాయి. ఎందరు చనిపోతున్నారో లెక్క తెలియడం లేదు

Update: 2022-03-13 02:14 GMT

రష్యా - ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. భీకర దాడులు జరుగుతున్నాయి. ఎందరు చనిపోతున్నారో లెక్క తెలియడం లేదు. మృతదేహాలను పూడ్చి పెట్టేందుకు కూడా సమయం ఇవ్వడం లేదు. ఇటు క్షిపణుల దాడులు, మరో వైపు రష్యా సేనల కాల్పులతో ఉక్రెయిన్ దద్దరిల్లిపోతుంది. నివాస భవనాలను కూడా వదలకుండా క్షపణులతో ర‌ష్యా దాడులకు దిగుతుండటంతో అనేక మంది మృత్యువాత పడుతున్నారు.

మసీద్ పై బాంబులు...
మరియాపోల్ నగరంలో ఒక మసీదుపై బాంబులు పడటంతో పెద్ద సంఖ్యలో మరణించినట్లు తెలిసింది. ఈ మసీదులో 34 మంది చిన్నారులు, 86 మంది టర్కీ పౌరులు తలదాచుకున్నారని చెబుతున్నారు. మృతుల వివరాలపై ఇంకా స్పష్టతలేదు. ఇక ఉక్రెయిన్ రాజధాని కీవ్ ను స్వాధీనం చేసుకోవడానికి రష్యా శతవిధాలుగా ప్రయత్నిస్తుంది. కీవ్ కు అతి దగ్గరకు రష్యా సేనలు చేరుకున్నాయి. ఏ సమయంలోనైనా కీవ్ లోకి ప్రవేశించే అవకాశముంది. యుద్ధం కొనసాగుతుండటంతో మృతదేహాలను ఖననం చేయడానికి కూడా వీలులేకుండా పోతుంది.


Tags:    

Similar News