నేడు తెలుగు రాష్ట్రాలకు విద్యార్థులు

ఉక్రెయిన్ నుంచి తెలుగు విద్యార్థులు నిన్ననే ఢిల్లీ చేరుకున్నారు. వారిని నేడు విమానంలో హైదరాబాద్ కు తీసుకురానున్నారు.

Update: 2022-02-27 02:04 GMT

హైదరాబాద్ : ఉక్రెయిన్ నుంచి తెలుగు విద్యార్థులు నిన్ననే ఢిల్లీ చేరుకున్నారు. వారిని నేడు విమానంలో హైదరాబాద్ కు తీసుకురానున్నారు. ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన వారి కోసం కేంద్ర ప్రభుత్వం రెండు ప్రత్యేక విమానాలను నడిపిన సంగతి తెలిసిందే. వీరిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు చెందిన విద్యార్థులు నిన్న ఢిల్లీ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.

ఈరోజు హైదరాబాద్ కు....
ఢిల్లీ చేరుకున్న విద్యార్థులకు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. ఏపీ, తెలంగాణ భవన్ లో వారికి వసతిని కల్పించాయి. తెలంగాణకు చెందిన విద్యార్థులను నేడు హైదరాబాద్ కు తీసుకురానున్నారు. అలాగే ఏపీ విద్యార్థులను విజయవాడకు చేరుస్తారు. అక్కడి నుంచి విద్యార్థులు వారి స్వస్థలాలకు వెళ్లేందుకు కూడా ఏర్పాట్లు చేశారు.


Tags:    

Similar News