చర్చలు విఫలం... యుద్ధం కొనసాగించడానికే....?

రష్యా - ఉక్రెయిన్ ల మధ్య జరిగిన చర్చలు అసంతృప్తిగానే ముగిశాయి. దాడులు కొనసాగించాలనే రష్యా నిర్ణయించింది

Update: 2022-03-11 04:12 GMT

రష్యా - ఉక్రెయిన్ ల మధ్య జరిగిన చర్చలు అసంతృప్తిగానే ముగిశాయి. దాడులు కొనసాగించాలనే రష్యా నిర్ణయించింది. నిన్న టర్కీలో జరిగిన రెండు దేశాల మధ్య చర్చలు ఫలప్రదం కాలేదు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిపోయే విధంగా కాల్పుల విరమణపైనే ఎక్కువగా చర్చ జరిగింది. రష్యా మాత్రం తాము యుద్ధం విరమించడానికి సిద్ధంగా లేమని, ఉక్రెయిన్ లొంగిపోవాల్సిందేనని స్పష్టం చేసింది.

ఆస్తి నష్టం.....
ఉక్రెయిన్ - రష్యాల మధ్య యుద్ధం దాదాపు 16 రోజుల నుంచి జరుగుతుంది. యుద్ధం కారణంగా ఉక్రెయిన్ కు 7.6 లక్షల కోట్ల నష్టం జరిగిందన్న అంచనాలు ఉన్నాయి. 76 మంది చిన్నారులు చనిపోయినట్లు ఉక్రెయిన్ పేర్కొంది. మరోవైపు అమెరికా ఉక్రెయిన్ కు 50 మిలియన్ డాలర్ల సాయాన్ని ప్రకటించింది. రష్యా ఉక్రెయిన్ నగరాలపై ఇంకా దాడులు కొనసాగిస్తూనే ఉంది. ఉక్రెయిన్ నుంచి ఇప్పటికే ఆరు లక్షల మందికి పైగా పౌరులు వెళ్లిపోయినట్లు చెబుతున్నారు.


Tags:    

Similar News