Ukraine war : ఎరక్కపోయి దిగాము... ఇరుక్కుపోయాము

రష్యా యుద్ధం మొదలు పెట్టిన వేళా విశేషమోమో కాని ఆ దేశానికి అడుగడుగునా ఇబ్బందులు ఎదురవుతున్నాయి

Update: 2022-03-08 12:51 GMT

రష్యా యుద్ధం మొదలు పెట్టిన వేళా విశేషమోమో కాని ఆ దేశానికి అడుగడుగునా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పటికే యుద్ధం ప్రారంభమయి పదమూడు రోజులవుతున్నా అతి చిన్న దేశమైన ఉక్రెయిన్ ను ఇప్పటి వరకూ స్వాధీనం చేసుకోలేకపోయింది. ముఖ్యమైన అధికారులతో పాటు సైనికులను, యుద్ధ సామగ్రిని కోల్పోయింది. దీనికి తోడు ప్రపంచ వ్యాప్తంగా రష్యాపై ఆంక్షలు మరింత తీవ్ర మవుతున్నాయి.

ప్రపంచ దేశాలన్నీ....
ప్రపంచ దేశాలన్నీ రష్యా వైఖరిని నిరసిస్తున్నాయి. ఇప్పటికే అత్యధిక ఆంక్షలను ఎదుర్కొంటున్న దేశాల్లో రష్యా మొదటి స్థానానికి చేరింది. తాజాగా షెల్ సంస్థ రష్యాపై ఆంక్షలు విధించింది. ఆయిల్, సహజవాయువులను రష్యా నుంచి కొనుగోళ్లను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. బ్రిటన్ ప్రభుత్వ రంగ సంస్థ అయిన షెల్ ప్రకటించడంతో రష్యాకు కోలుకోలేని దెబ్బగా చెప్పుకోవచ్చు. దీనివల్ల రష్యా ఆర్థికంగా మరింత ఇబ్బంది పడే అవకాశముంది.
ఆయిల్ అమ్మకాలపై.....
రష్యా ఆదాయంలో అధిక భాగం ఆయిల్ అమ్మకాల నుంచే వస్తాయి. అయితే దీనిని నిలిపేయాలని షెల్ సంస్థ నిలిపేస్తుందని ఆ దేశం కూడా ఊహించలేదు. ఇప్పుడు అన్ని దేశాలు రష్యా పై 2700 ఆంక్షలు విధించాయి. అన్నీ ఆంక్షలు కలిపి 5,500 వరకూ ఉన్నాయి. అయితే ఆయిల్ పై నిషేధం విధించడంతో భారత్ లాంటి దేశాలకు ఎగుమతి చేసుకోవడం కష్టంగా మారనుంది. ఈ ప్రభావం భారత్ పై పడుతుందన్న ఆందోళన వ్యక్తమవుతుంది. మొత్తం మీద ప్రపంచ దేశాల్లో రష్యా ఒంటరి అయిందని చెప్పడానికి ఆ దేశంపై విధించిన ఆంక్షల సంఖ్యే ఉదాహరణ.


Tags:    

Similar News