Ukrain War : కీవ్ కు చేరువలో రష్యా బలగాలు

ఉక్రెయిన్ రాజధాని కీవ్ ను స్వాధీనం చేసుకునే దిశగా రష్యా బలగాలు ముందుకు సాగుతున్నాయి.

Update: 2022-03-01 07:11 GMT

ఉక్రెయిన్ రాజధాని కీవ్ ను స్వాధీనం చేసుకునే దిశగా రష్యా బలగాలు ముందుకు సాగుతున్నాయి. దాదాపు 65 కిలోమీటర్లు పొడవు ఉన్న రష్యా సైనికుల కాన్వాయ్ కీవ్ కు సమీపంలోనే ఉంది. ఇప్పటికే కీవ్ పై దాడులు సాగిస్తోంది. ఒకవైపు చర్చలంటూనే మరోవైపు రష్యా కీవ్, ఖర్కీవ్ నగరాలను ఆక్రమించుకునే ప్రయత్నంలో ఉంది. ఖర్కీవ్ లో ని అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ పై రష్యా క్షిపణులతో దాడి చేయడంతో భవనం ధ్వంసమయింది.

ఆరోరోజు యుద్ధంలో....
కీవ్ తో పాటు మిగిలిన నగరాలు టెర్రోపిల్, రివ్నేలను కూడా కైవసం చేసుకునేందుకు రష్యా బలగాలు ప్రయత్నిస్తుంది. ఉక్రెయిన్ - రష్యాల మధ్య యుద్ధం ఆరోరోజుకు చేరుకుంది. ఇప్పటి వరకూ ఎదురొడ్డి నిలిచిన ఉక్రెయిన్ సేనలు ప్రధాన నగరాల్లో రష్యా సైనికులు ప్రవేశించకుండా అడ్డుకోగలిగాయి. కానీ పెద్దయెత్తున రష్యాబలగాలు తరలి వస్తుండటంతో వారిని ఎదుర్కొనడం సాధ్యమయ్యే పనికాదంటున్నారు. ఒఖ్ తీర్కా మిలటరీ బేస్ పై జరిపిన దాడిలో 70 మంది ఉక్రెయిన్ సైనికులు మృతి చెందారు. మొత్తం మీద రాజధాని కీవ్ ను ఏ క్షణంలోనైనా రష్యా ఆక్రమించుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి.


Tags:    

Similar News