Ukraine War : పుతిన్ కు మోదీ ఫోన్

ఉక్రెయిన్ - రష్యాల మధ్య ప్రారంభమైన యుద్ధం విషయంలో నరేంద్ర మోదీ కల్పించుకున్నారు. యుద్ధం నివారించే ప్రయత్నం చేశారు

Update: 2022-02-25 01:37 GMT

ఉక్రెయిన్ - రష్యాల మధ్య ప్రారంభమైన యుద్ధం విషయంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ కల్పించుకున్నారు. యుద్ధం నివారించే ప్రయత్నం చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ తో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ లో మాట్లాడారు. హింసను వదిలేయాలిన మోదీ పుతిన్ కు సూచించారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. దౌత్యపరంగానే సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని, ఆ మార్గంలోనే పయనించాలని ప్రధాని మోదీ పుతిన్ ను కోరారు.

చర్చల ద్వారానే....
ఇటీవల జరిగిన పరిణామాలను ప్రధాని మోదీకి పుతిన్ వివరించారని చెబుతున్నారు. నాటో దేశాలు, రష్యాల మధ్య విభేదాలను చర్చల ద్వారానే పరిష‌్కరించుకోవాలని ప్రధాని మోదీ పుతిన్ కు సూచించారు. ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారత విద్యార్థులను సురక్షితంగా దేశానికి తీసుకువచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. రష్యా, భారత్ ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపర్చుకునేందుకు తరచూ చర్చలు జరపాలని ఇటు మోదీ, అటు పుతిన్ అభిప్రాయపడ్డారు.


Tags:    

Similar News