Ukraine War : ఎంబసీ కీలక ప్రకటన..భారత జెండాతోనే?

ఉక్రెయిన్ లో భారత రాయబార కార్యాలయం కీలక ప్రకటన చేసింది. విద్యార్థులు తమ వాహనాలపై భారత్ జెండాను ఉంచాలని పేర్కొంది

Update: 2022-02-25 07:54 GMT

ఉక్రెయిన్ లో భారత రాయబార కార్యాలయం కీలక ప్రకటన చేసింది. విద్యార్థులు తమ వాహనాలపై భారత్ జెండాను ఉంచాలని పేర్కొంది. హంగేరీ బోర్డర్ చెక్ పోస్టుకు చేరుకోవాలని సూచించింది. ఇలా అయితే ఆ వాహనాలకు కాని, అందులో ప్రయాణిస్తున్న వారికి కాని ఎలాంటి హాని జరగదని పేర్కొంది.

పుతిన్ తో మాట్లాడిన తర్వాత....
ఇప్పటికే ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్ తో మాట్లాడారు. తమ దేశ పౌరుల పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఉక్రెయిన్ లో భారతీయులకు ఎలాంటి హానీ తమ రష్యా సైన్యం తలపెట్టబోదని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే భారత రాయబార కార్యాలయం విద్యార్థులను భారతీయ జెండా ఉన్న వాహనంలో రావాలని కోరింది. హంగేరీ బోర్డర్ కు చేరుకుంటే అక్కడి నుంచి సులువుగా విద్యార్థులను తీసుకు వచ్చే అవకాశముంది.


Tags:    

Similar News