UGADI 2023 : ఉగాది రోజున ఈ పనులు అస్సలు చేయకండి

చెట్లు కొత్త చిగురువేసి, పూత ఆరంభమవుతుంది. అలాగే సువాసనతో గుబాళించే మల్లెపువ్వులు ఉగాది నుంచి వస్తాయి.

Update: 2023-03-19 10:25 GMT

ugadi panchanga sravanam

ప్రతి ఏటా చైత్ర శుద్ధ పాడ్యమి రోజున ఉగాది పర్వదినం జరుపుకోవడం అనాదిగా వస్తోన్న సాంప్రదాయం. బ్రహ్మ ఈ సృష్టిని ప్రారంభించిన రోజే ఉగాది అని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఉగాది పర్వదినంతో ప్రకృతిలోనూ మార్పులు జరుగుతాయి. చెట్లు కొత్త చిగురువేసి, పూత ఆరంభమవుతుంది. అలాగే సువాసనతో గుబాళించే మల్లెపువ్వులు ఉగాది నుంచి వస్తాయి. ఈ ఏడాది మార్చి 22, బుధవారం నుంచి శోభకృతు నామ సంవత్సరం మొదలు కానుంది. కాగా.. ఉగాది రోజున చాలామంది తెలియక కొన్నిపొరపాట్లు చేస్తుంటారు. ఉగాది రోజున ఏయే పనులు చేయాలి. ఏయే పనులు చేయకూడదు. చేస్తే ఏం జరుగుతుందో తెలుసుకుందాం.

ఉగాది రోజున ఇంటి ముందు ధ్వజారోహణం చేయాలట. తెలుగు రాష్ట్రాల్లో ఈ ఆచారం లేదు కానీ.. నార్త్ ఇండియాలో హిందువులు ఉగాది రోజున ఇంటి ముందు ఒక కర్రను పాతి దానికి జెండాను కట్టి ధ్వజారోహణం చేస్తారు.
ఉగాది పర్వదినం రోజున ఖచ్చితంగా కొత్తబట్టలు వేసుకోవాలి. మన తెలుగు సంవత్సరానికి ఇదే ఆరంభం. ఆరోజు ఎలా అయితే ఉంటామో సంవత్సరమంతా అలానే ఉంటామని ప్రతీతి.
ఉగాది నాడు షడ్రుచుల పచ్చడి ఖచ్చితంగా తినాలి. ఈ పచ్చడితో నవగ్రహాలకు కూడా సంబంధం ఉంటుంది. ఉగాది పచ్చడిలోని తీపికి గురుడు, ఉప్పుకు చంద్రుడు, కారానికి కుజుడు, మిరియాల పొడికి రవి, పులుపుకి శుక్రుడు అన్ని రుచులు కలిపిన వారికి శని, బుధ గ్రహాలు కూడా కారకులవుతారని పండితులు చెబుతున్నారు.
ఉగాది రోజున సూర్యోదయం తర్వాత.. పొద్దెక్కేంతవరకూ పడుకోవడం మంచిది కాదు
ఈ పండుగ రోజున మాంసాహారం, మద్యం, సిగరెట్ వంటి వాటికి దూరంగా ఉండాలి.
చిరిగిన, మాసిపోయిన, పాతబట్టలను ధరించరాదు. ఉన్నంతలో కొత్తసంవత్సరాది రోజున మంచి బట్టలు ధరించాలి.
ముఖ్యంగా దక్షిణ ముఖంా కూర్చుని పంచాగ శ్రవణం చేయకూడదు. అలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదని పండితులు చెబుతున్నారు.









Tags:    

Similar News