హైదరాబాద్ కు టాటా చెప్పేస్తున్న ఎపి అసెంబ్లీ!

Update: 2016-03-31 16:22 GMT

హైదరాబాద్ లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఇక జరగక పోవచ్చని అంటున్నారు. ఎంత వీలైతే అంత తొందరగా హైదరాబాద్ కేంద్రంగా కాకుండా అమరావతిలోనే రాష్ట్ర పాలనను సాగించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉత్సుకతను బట్టి ఇక నుంచి జరుగనున్న అసెంబ్లీ సమావేశాలన్నీ వెలగపూడిలోనే జరుగుతాయని పాలకులు అంటున్నారు. ఏపీ బడ్జెట్ సమావేశాలు బుధవారంసాయంత్రం నాలుగు గంటల సమయంలోనిరవధికంగా వాయిదా పడ్డాయి. ఇవే హైదరాబాద్ లో ఏపీ అసెంబ్లీ చివరి సమావేశాలుఅనిమంత్రులు…ఎమ్మెల్యేలు చెబుతున్నారు. బడ్జెట్ సమావేశాలు ముగిసిన నేపథ్యంలో తర్వాత జరగాల్సిన సమావేశాలు వర్షాకాలసమావేశాలే. వీటిని ఆగస్టు లేదా సెప్టెంబర్ లో నిర్వహించే అవకాశాలున్నాయి. ఆలోగా అమరావతి ప్రాంతంలోని వెలగపూడిలోనిర్మిస్తున్నతాత్కాలిక సచివాలయం సిద్ధం కానుంది. అందులోనే లక్ష చదరపు అడుగుల్లో లెజిస్లేచర్కోసం ఓ భవనాన్ని కూడాకేటాయించారు. దీంతో అసెంబ్లీ వర్షాకాల సమావేశాలుఅమరావతిలోనే జరిగే అవకాశం ఉందంటున్నారు. పైగా అవి స్వల్పకాలసమావేశాలుకావటంతో ఎమ్మెల్యేలకు నివాస సముదాయాలు సమకూర్చటం కూడా పెద్ద కష్టం కాబోదనిభావిస్తున్నారు. హైదరాబాద్ లో ఇవే ఆఖరి అసెంబ్లీ సమావేశాలు కావచ్చని ఏపీ వ్యవసాయశాఖమంత్రి పత్తిపాటి పుల్లారావు బుధవారం నాడు అసెంబ్లీ లాబీల్లోవిలేకరులతో ఇష్టాగోష్టిగామాట్లాడుతూ చెప్పారు.ఇక సమావేశాల కోసం హైదరాబాద్ కు రాకపోవచ్చని అన్నారు. అయితే తాత్కాలికసచివాలయ నిర్మాణం అయితే పూర్తి అవుతుందికానీ..అప్పటికి రహదారులు, ఇతరమౌలికసదుపాయాలు అన్నీ రెడీ అవుతాయా? లేదా అన్న అనుమానం మాత్రం అధికారవర్గాలువ్యక్తం చేస్తున్నాయి. ఈ వేసవి సీజన్ లోనూ సర్కారు వెలగపూడికి రహదారులకనెక్టివిటి పెంచి ఇబ్బందిలేకుండ చేస్తే మాత్రంసమావేశాలు అక్కడే ఉంటాయని..ఇకహైదరాబాద్ లో ఏపీ అసెంబ్లీ సమావేశాలను మర్చిపోవచ్చని ఓ ఉన్నతాధికారివ్యాఖ్యానించారు.వచ్చే జూన్ నాటికే సచివాలయాన్ని ఏపీకి తరలించాలని సర్కారుపట్టుదలగా ఉన్న విషయం తెలిసిందే. జూన్ నాటికల్లా అన్ని శాఖల హెచ్ఓడీలు, ఇతర అధికారులందరూ అమరావతి ప్రాంతానికి తరలి వెళ్ళేందుకు సన్నద్దమవుతున్నారు. జూన్ కల్లా సిబ్బంది తరలింపు, శాఖల ఏర్పాట్లు తదితరాలన్నీ పూర్తయిన పక్షంలో అసెంబ్లీ సమావేశాలు కూడా అక్కడే జరిగే అవకాశాలున్నాయి.

Similar News