హెడ్ బాగానే ఉంది..హ్యాండ్స్ బాగాలేవు : జేసీ

Update: 2017-01-13 14:00 GMT

టీడీపీలో హెడ్ బాగానే ఉంది. కాని హ్యాండ్స్ బాగాలేవు అని మరోసారి తెలుగుదేశం పార్టీపై పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి సెటైర్లు వేశారు. గతంలో కూడా జేసీ చంద్రబాబు అధికారుల చేతుల్లో కీలుబొమ్మగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఐఏఎస్ లు చెప్పింది చెప్పినట్లు సీఎం చేస్తున్నారని కానితాను ఎన్నిసార్లు చెప్పినా బాబు విన్పించుకోవడం లేదన్నారు. ఇప్పడు అదే విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించారు. రాష్ట్రంలో సినిమా వాళ్లకు గ్లామర్ ఉండొచ్చేమో గాని, రాజకీయాల్లో వాళ్లను పట్టించుకోరన్నారు. పవన్ కల్యాణ్ కు అధికారంలోకి వచ్చేంత సీన్ లేదన్నారు.

కాగా కులం కులం అని ఎందుకు అరుస్తున్నారని, కులంతో ఎటువంటి పనులు కావన్నారు. తాను అసలైన, స్వచ్ఛమైన రెడ్డినని, జగన్, రఘువీరాలు అసలైన రెడ్లు కాదన్నారు. కాని ఈ సంచలన వ్యాఖ్యలు జేసీ కోడిపందేల బరి వద్ద చేశారు. ఆయన పశ్చిమ గోదావరి జిల్లా కలిదిండి మండలం తాడినాడలో జరిగిన కోడి పందేలను వీక్షించారు. ఈ కోడిపందేలకు మరో ఎంపీ మాగంటి బాబు కూడా హాజరయ్యారు.

Similar News