హాంకాంగ్ ఓపెన్ రన్నరప్ గా నిలిచిన సింధు

Update: 2016-11-27 07:02 GMT

చైనా ఓపెన్ లో తిరుగులేని ఆధిపత్యాన్ని కనబరిచి చాంపియన్ గా ఆవిర్భవించిన పీవీ సింధు.. హాంకాంగ్ ఓపెన్ ఫైనల్లో కాస్త తడబాటుకు గురైంది. అంతిమంగా రన్నరప్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అప్రతిహత విజయాలతో ఫైనల్ వరకు దూసుకు వచ్చిన పీవీ సింధు – తన ప్రత్యర్థి తయ్ జు చేతిలో వరుస సెట్లలో ఓడిపోయింది. తొలి సెట్ లో 15-21, మలి సెట్ లో 17-21 పాయింట్ల తేడాతో సింధు రన్నరప్ స్థానానికి పరిమితం అయింది.

చైనా తైపీ క్రీడాకారిణి తయ్ జు హాంకాంగ్ ఓపెన్ ఛాంపియన్ గా నిలిచింది. ఫైనల్ మ్యాచ్ లో సింధు తొలిసెట్ ను కోల్పోయినప్పటికీ అభిమానులు మాత్రం.. ఆమె తిరిగి విజృంభిస్తుందనే ఆశించారు. ఎందుకంటే చైనీస్ ఫైనల్ లో కూడా తొలిసెట్ ను కోల్పోయిన తర్వాత.. వరుస సెట్లలో విజృంభించి ఛాంపియన్ సింధు నిలిచిన వైనం ఆమె అభిమానులకు గర్తుంది. హాంకాంగ్ ఓపెన్ లో కూడా సింధు అదే మ్యాజిక్ ను రిపీట్ చేస్తుందని అంతా ఆశించారు. కానీ హోరా హోరీగా సాగిన మ్యాచ్ లో తయ్ జు పవర్‌ఫుల్ గేమ్ ముందు సింధు ఆట చాల లేదు. వరుస సెట్లలో ఆమె పెద్దగా ప్రతిఘటన లేకుండానే విజయం సాధించింది.

Similar News