సైకిల్ పార్టీలో ముసలం ముగిసింది!

Update: 2016-10-25 05:02 GMT

ఉత్తరప్రదేశ్ లోని సమాజ్‌వాదీ పార్టీలో పుట్టిన ముసలం ఒక కొలక్కి వచ్చింది. కొడుకు , ప్రస్తుత సీఎం కన్నీళ్లు కూడా పెట్టుకున్న తర్వాత.. తాను తండ్రి మాట జవదాటే రకం కాదని సెలవిచ్చిన తర్వాత, అసలు తాను కొత్త పార్టీ పెట్టే ఆలోచన ఎందుకు చేస్తానంటూ క్లారిటీ ఇచ్చిన తర్వాత.. ఒక రోజు వ్యవధిలో ఎస్పీ అధినేత , వృద్ధ నేత ములాయం సింగ్ యాదవ్ తన పార్టీలో పుట్టిన అంతర్గత కలహాన్ని సమర్థంగా పరిష్కరించారు. బాబాయ్ మరియు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు శివపాల్ యాదవ్, అబ్బాయి మరియు సీఎం అఖిలేష్ యాదవ్ మధ్య ములాయం సఖ్యత కుదిర్చారు. ఇందులో భాగంగా.. కేబినెట్ నుంచి తీనే బర్తరఫ్ చేసిన బాబాయి శివపాల్ కు అఖిలేష్ తిరిగి మంత్రి పదవి కట్టబెట్టారు.

ములాయం పార్టీలో పుట్టిన ముసలం ముగిసిపోయినట్లే కానీ.. ఈ ముసలానికి ఒక కేంద్రబిందువుగా భావిస్తున్న అమర్ సింగ్ ప్రస్తుత పరిస్థితి ఏమిటో స్పష్టత రావడం లేదు. అమర్ సింగ్ కు తనకు వ్యతిరేకంగా కోటరీని నడిపించారంటూ అఖిలేష్ ఆవేదన వ్యక్తంచేసిన సంగతి తెలిసిందే. అయితే తాజా పరిణామాల్లో కుటుంబంలో సఖ్యత ఏర్పడగానే.. అపర చాణక్యుడు అయినా అమర్ సింగ్ కూడా మాట ఫిరాయించినట్లు కనిపిస్తోంది.

ఆయన యూపీలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. అఖిలేష్ యాదవ్ అత్యద్భుతమైన ముఖ్యమంత్రి అని ఆకాశానికెత్తేయడం విశేషం. ఆయన మాస్ లీడర్ కావాలంటే మరికాస్త సమయం పడుతుందని అంటున్న అమర్ సింగ్.. సీఎంగా పనితీరు విషయంలో మాత్రం.. అఖిలేష్ ను నెత్తిన పెట్టుకోవడం గమనార్హం.

Similar News