సుజన కి సుప్రీంలో ఉరట!

Update: 2016-04-13 00:04 GMT

కేంద్ర మంత్రి సుజనా చౌదరికి చెందిన సంస్థలపై దాఖలైన పిటీషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. సుజనా గ్రుప్ సంస్థలో చోటు చేసుకున్న అవకతవకలపై దాఖలైన పిటీషన్‌ను సోమ వారం సర్వోన్నత న్యాయస్థానం పరిశీలిం చింది. సుజనా సంస్థలపై సిబిఐ దర్యాప్తునకు ఆదేశించాలని వినోద్ కుమార్ అనే వ్యక్తి వేసిన రిట్‌పిటీషన్ న్యాయస్థాసం తోసిపుచ్చింది. ఆర్టికల్ 32 ప్రకారం పిటీషన్ విచారణార్హం కాదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ కేసు విషయంలో కింది కోర్టును ఆశ్రయించాలని న్యాయస్థానం పిటీషన్‌ను ఆదేశించింది. ఇటీవలే కింది కోర్టు సుజనా చౌదరికి నాన్‌బెయిలబుల్ వారెంటును జారీ చేసిన విష యం విదితమే. తాజా పిటీషన్ నేపథ్యంలో సుజనా గ్రూప్ సంస్థల కేసును సర్వోన్నత న్యాయస్థానం సిబిఐకు అప్పగిస్తుందని భావించిన పిటీషనర్‌కు ఆశాభంగం కలిగింది. ఈ కేసుకు సంబంధించి కేంద్ర మంత్రి సుజనా చౌదరి స్పష్టంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ విలేకరులకు వివరించిన విషయం విదితమే. అయితే తాజాగా సుప్రీంకోర్టులో దాఖలైన పిటీషన్‌తో సుజనా గ్రూప్‌లో మరింత ఆందోళన చోటు చేసుకుంది. కానీ సుప్రీంకోర్టు పిటీషన్‌ను తోసి పుచ్చటంతో కొంత ఊరట కలిగింది. అయితే పిటీషనర్ మాత్రం తాను కిందికోర్టును ఆశ్రయిస్తానని పేర్కొన్నారు.

Similar News