శ్రీనగర్ బయలుదేరిన ఢిల్లీ విద్యార్దులు!

Update: 2016-04-09 22:51 GMT

జమ్మూ కాశ్మీర్ లోని శ్రీనగర్ నిట్‌లో విద్యార్థుల ఆందోళన కొనసాగుతూనే ఉంది. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ తెల్లవారుజామున 4 గంటల వరకు విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. క్యాంపస్‌లో చదువుకునే వాతావరణం కల్పించాలని ఆందోళన చేస్తోన్నా నిట్ నిర్వహకులు పట్టించుకోలేదు. శ్రీనగర్ నిట్‌లో తీవ్ర సమస్యలనెదుర్కొంటోన్న స్థానికేతర విద్యార్థులకు ఢిల్లీ విద్యార్థులు సంఘీభావం ప్రకటించారు. ఈమేరకు ఇవాళ ఢిల్లీ నుంచి 12 రాష్ర్టాలకు చెందిన సుమారు 150 మంది విద్యార్థులు జాతీయ జెండాలను పట్టుకుని శ్రీనగర్ నిట్‌కు బయలుదేరి వెళ్లారు. ?ఛలో ఎన్‌ఐటీ? అంటూ నినాదాలు చేస్తూ బైకులు, కార్లు, బస్సుల్లో అక్కడకు బయలుదేరారు. దీంతో శ్రీనగర్ నిట్ వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. కాగా, ఇండియా, పాకిస్థాన్‌ల మధ్య క్రికెట్ మ్యాచ్ సందర్భంగా శ్రీనగర్ నిట్‌లో స్థానిక, స్థానికేతర విద్యార్థుల మధ్య ఘర్షణ తలెత్తిన విషయం తెలిసిందే. నాటి నుంచి నేటి వరకు నిట్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి.శ్రీనగర్ నిట్‌లో తీవ్ర సమస్యలనెదుర్కొంటోన్న స్థానికేతర విద్యార్థులకు ఢిల్లీ విద్యార్థులు సంఘీభావం ప్రకటించారు. ఈమేరకు ఇవాళ ఢిల్లీ నుంచి 12 రాష్ర్టాలకు చెందిన సుమారు 150 మంది విద్యార్థులు జాతీయ జెండాలను పట్టుకుని శ్రీనగర్ నిట్‌కు బయలుదేరి వెళ్లారు. ?ఛలో ఎన్‌ఐట?! అంటూ నినాదాలు చేస్తూ బైకులు, కార్లు, బస్సుల్లో అక్కడకు బయలుదేరారు. దీంతో శ్రీనగర్ నిట్ వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. కాగా, ఇండియా, పాకిస్థాన్‌ల మధ్య క్రికెట్ మ్యాచ్ సందర్భంగా శ్రీనగర్ నిట్‌లో స్థానిక, స్థానికేతర విద్యార్థుల మధ్య ఘర్షణ తలెత్తిన విషయం తెలిసిందే. నాటి నుంచి నేటి వరకు నిట్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి.

Similar News