శ్రీ జయేంద్ర సరస్వతి మహాస్వామి శివైక్యం

Update: 2018-02-28 05:51 GMT

కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతి మహాస్వామి శివైక్యం పొందారు. ఆయన వయస్సు 82సంవత్సరాలు. 1935జూలై 19న తమిళనాడులోని తంజావూరులో జన్మించిన శ్రీ జయేంద్ర సరస్వతి మహాస్వామి 1954మార్చి 22న కంచి పీఠాధిపతిగా బాధ్యతలు స్వీకరించారు. శ్రీ జయేంద్ర అసలు పేరు సుబ్రహ్మణ్య మహాదేవ అయ్యర్. పీఠాధిపతి అయ్యాక జయేంద్ర సరస్వతిగా పేరుమార్చుకున్నారు. గత కొంతకాలంగా శ్వాస సంబంధమైన వ్యాధితో బాధపడుతున్న శ్రీ జయేంద్ర సరస్వతి నిన్నటివరకు కంచి మఠంలోనే ఉన్నారు. తమిళనాడు గవర్నర్‌ భన్వరీలాల్‌ పురోహిత్‌ మంగళవారం వచ్చి ఆయన ఆశీర్వాదం తీసుకుని వెళ్లారు. రాత్రి జయేంద్ర సరస్వతికి ఒక్కసారిగా శ్వాస సమస్యలు తలెత్తడంతో శిష్యులు కంచి మఠానికి చెందిన ఆస్పత్రికి తరలించారు.జయేంద్ర సరస్వతికి వైద్యులు మెరుగైన చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో బుధవారం ఉదయం 9 గంటల సమయంలో శంకర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో మహానిర్యాణం చెందారు. ఆయన పార్థివదేహాన్ని కంచి కామకోటి పీఠానికి తరలించారు.

Similar News