శ్రీ చైతన్య తో కలిసిపోయిన నారాయణ!

Update: 2016-04-14 00:39 GMT

కేశవరెడ్డి విద్యా సంస్థలు నిర్వహణను చైతన్య విద్యాసంస్థలకు అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కేశవరెడ్డి విద్యా సంస్థల అధిపతి కేశవరెడ్డి ఆర్ధిక అవకతవకలకు పాల్పడిన నేపధ్యంలో అక్కడి విద్యార్ధుల భవిష్యత్ ప్రశార్ధంగా మారింది. ఈ నేపధ్యంలో విద్యార్ధుల భవిష్యత్ కేశవరెడ్డి విద్యా సంస్థలు నిర్వహణను చైతన్య విద్యాసంస్థలకు అప్పగించింది ఏపీ సర్కార్. అయితే ఈ వ్యవహరంలో కుట్రదాగివుందని ఆరోపించారు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు. ఎపిలో జరుగుతున్న పరిణామాలు చాలా అన్యాయంగా ఉన్నాయన్న ధర్మాన.. కేశవరెడ్డి విద్యాసంస్థల బాధ్యతను మొత్తం శ్రీచైతన్యకు అప్పగించడం వెనుక కుట్ర దాగి ఉందన్నారు. శ్రీచైతన్యలో మంత్రి నారాయణ వాటా తీసుకోవడం వల్లే వాటి బాధ్యతను చైతన్యకు అప్పగించారని ఆరోపించారాయన. మరిమ దీనిపై మంత్రి స్పందన ఎలా వుటుందో..

Similar News