వైసీపీ డిఫెన్స్ లో పడిపోయిందా?

Update: 2018-02-06 10:50 GMT

ఢిల్లీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలతో సీనియర్ నేతలతో చంద్రబాబు చర్చించారు. టీటీడీపీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. టీడీపీ పెట్టిన ఒత్తిడితోనే కేంద్రంలో కదలిక వచ్చిందన్నారు. ప్రధాని మోడీ సుజనాచౌదరితో భేటీ అయి ఆయన చెప్పిన వివరాలను చంద్రబాబుకు చెప్పారు. మోడీ ఏపీ పట్ల సానుకూలత వ్యక్తం చేశారని, కేంద్ర హోంమంత్రి రాజ్ నాధ్ సింగ్ కూడా ప్రధాని మోడీతో భేటీ అయి ఏపీకి ఇచ్చిన హామీలపై చర్చించారు. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ కూడా స్పందించారు. సానుకూల పరిష్కారం కోసం చూస్తున్నామని చెప్పారు. చట్టంలో విశాఖ రైల్వే జోన్ సాధ్యాసాధ్యాలపై పరిశీలిస్తున్నామని చెప్పారు. చట్టంలో మాత్రం కేవలం జోన్ ను పరిశీలించాలని మాత్రమే ఉందని పియూష్ గోయల్ చెప్పారు. ఈఏపీ నిధులను నాబార్డు ద్వారా ఇవ్వాలని ముఖ్యమంత్రి కోరుతున్నారని, అయితే నాబార్డు ద్వారా తీసుకుంటే రాష్ట్రానికి అప్పు తీసుకునే సామర్థ్యం తగ్గుతుందని అరుణ్ జైట్లీ అభిప్రాయపడ్డారు. ఏపీకి రెవెన్యూ లోటు కింద ఇప్పటికే 3900 కోట్లు ఇచ్చామాన్నారు. విభజన చట్టాన్ని యూపీఏ ప్రభుత్వం సక్రమంగా చేసి ఉంటే ఇన్ని సమస్యలు వచ్చేవి కావన్నారు. విభజన హామీల అమలుకు చిత్తశుద్ధితో కృషి చేస్తామన్నారు జైట్లీ. ఈ విషయాలను టీటీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో చంద్రబాబు నేతలతో చర్చించారు. వత్తిడి పెట్టడం వల్లనే కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చిందన్నారు. ప్రతిపక్ష వైసీపీ డిఫెన్స్ లో పడిపో్యిందని అభిప్రాయపడ్డారు. మొత్తం మీద టీడీపీ ఎంపీల ఆందోళన కారణంగానే కేంద్రంలో కదలిక వచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నేతలతో చెప్పారు.

Similar News