రోజూ జగన్ టెంట్ లోనే నిద్ర

Update: 2017-11-06 04:30 GMT

వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర ప్రారంభమైంది. ఇడుపులపాయలో వైఎస్ సమాధికి నివాళులర్పించిన జగన్ ప్రజాసంకల్ప యాత్రను ప్రారంభించారు. మధ్యాహ్నం, రాత్రి టెంట్లలోనే జగన్ బస చేసేలా వైసీపీ నేతలు ఏర్పాట్లు చేశారు. ఇడుపులపాయలో ప్రారంభమైన జగన్ యాత్ర ఇచ్ఛాపురం వరకూ దాదాపు మూడు వేల కిలోమీటర్ల మేరకు సాగనుంది. 2019 అధికారమే లక్ష్యంగా ఈ యాత్రను చేపట్టనున్న జగన్ రోజుకు 14 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తారు. ఉదయం 8.30గంటలకు ప్రారంభమయ్యే ఈ యాత్ర 7 కిలోమీటర్లు ప్రయాణించిన అనంతరం భోజన విరామానికి ఆగుతారుద. తిరిగి మధ్యాహ్నం 3.30గంటలకు పాదయాత్ర ప్రారంభించి రాత్రి 7.30గంటలకు రాత్రి బసకు ఆగుతారు. ఈరోజు ఇడుపుల పాయలో ప్రారంభమయ్యే ఈయాత్ర మధ్యాహ్నం వీరన్నగట్టు మండలంలో భోజన విరామానికి ఆగుతారు. వేంపల్లి మండలంలో రాత్రి బసకు జగన్ ఆగుతారు.

రోజుకు 14 కిలోమీటర్లు......

కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు జిల్లాల మీదుగా ఈ యాత్ర కొనసాగుతుంది. ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని ఆ సమస్యలను పరిష్కరించేందుకు తన మేనిఫేస్టోలో పెడతానని వైఎస్ జగన్ చెప్పారు. జగన్ పాదయాత్ర కోసం అన్ని జిల్లాల్లో ఇప్పటికే సన్నాహక కార్యక్రమాలు వైసీపీ శ్రేణులు చేపట్టాయి. దారిపొడవునా జగన్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. స్వాగతద్వారాలు కూడా ఏర్పాటయ్యాయయి. తొలిరోజు యాత్రలో వైసీపీ అగ్రనేతలందరూ పాల్గొంటున్నారు. వారు కూడా జగన్ వెంట నడవనున్నారు. టీడీపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రత్యేక హోదా సాధించలేకపోవడం, విశాఖ రైల్వే జోన్, కడప స్టీల్ ఫ్యాక్టరీ వంటి సమస్యలను పాదయాత్ర పొడవునా ప్రస్తావిస్తారు. మొత్తం మీద జగన్ పాదయాత్ర ప్రారంభం కావడంతో వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం రెట్టింపయింది.

Similar News