రేవంత్ కు టీడీపీ వాసనలు పోలేదా?

Update: 2018-01-18 07:47 GMT

కాంగ్రెస్ కు వ్యతిరేకంగా టీడీపీ పుట్టిందన్న సిద్ధాంతానికి కాలం చెల్లిందని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. సామాజిక న్యాయం కాంగ్రెస్ తోనే సాధ్యమవుతుందన్నారు. ఏపీలో జగన్, తెలంగాణాలో టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా అందరూ ఏకం కావాలని రేవంత్ పిలుపునిచ్చారు. బీసీలు, దళితులను కేసీఆర్ మోసం చేస్తుంటే వారి వెంట ఎలా నడుస్తారని ప్రశ్నించారు. బీసీ సబ్ కమిటీ నివేదిక తీసుకునే తీరిక కూడా కేసీఆర్ కు లేదన్నారు. టీడీపీ నాయకులు ఎటు వెళ్లినా బీసీ, దళిత నేతలంతా కాంగ్రెస్ లోకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నేతగా ఉన్న రేవంత్ రెడ్డి ఏపీలో జగన్ కు వ్యతిరేకంగా ఏకం కావాలని పిలుపునివ్వడం చర్చనీయాంశమైంది. అక్కడ కాంగ్రెస్ నేతలు టీడీపీపై పోరాడుతుంటే తెలంగాణ కాంగ్రెస్ లో ఉన్న రేవంత్ మాత్రం ఏపీ టీడీపీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేశారన్న విమర్శలు విన్పిస్తున్నాయి. తెలంగాణలో కేసీఆర్ కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారంటే అర్థముంది. ఏపీలో టీడీపీకి అనుకూలంగా, జగన్ కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు రేవంత్ చేయడంపై ఆయనకింకా పసుపు వాసనలు పోలేదని స్పష్టమవుతోంది.

Similar News