రాహుల్ ఏకబిగిన మూడు చోట్ల...?

Update: 2017-11-06 18:29 GMT

హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ప్రచారం వేడెక్కింది. ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా ఇప్పటికి మూడుసార్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ నేతలపై ధ్వజమెత్తారు. అవినీతి కేసుల్లో కూరుకుపోయిన కాంగ్రెస్ నేతలకు రాష్ట్రాన్ని పాలించే హక్కు లేదన్నారు. కాంగ్రెస్ నేతలు కోర్టులకు తిరగడం కోసమే సమయం వెచ్చిస్తున్నారని మోడీ ప్రచారంలో దుయ్యబట్టారు. ఇప్పటికి ప్రధాని మోడీ మూడు సార్లు హిమాచల్ ప్రదేశ్ లో పర్యటించారు. ఈ నెల 9న హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 68 స్థానాలకు జరగనున్న ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ హోరాహోరీ తలపడుతున్నాయి.

కాంగడా లో పట్టుకోసం.....

మరోవైపు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈరోజు హిమాచల్ ప్రదేశ్ లో విస్తృతంగా పర్యటించారు. మొత్తం మూడు చోట్ల బహిరంగ సభల్లో పాల్గొన్నారు. శిరమౌర్, కాంగడా, చాంబా ప్రాంతాల్లో జరిగిన బహిరంగ సభల్లో రాహుల్ ప్రసగించారు. 2012 ఎన్నికల్లో కాంగడా ప్రాంతంలోనే కాంగ్రెస్ కు 12 స్థానాలు లభించాయి. మళ్లీ అవే స్థానాలను నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ విశ్వప్రయత్నం చేస్తోంది. రాహుల్ పర్యటనతో కాంగ్రెస్ దే విజయమంటున్నారు ఆ పార్టీ నేతలు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల హిమాచల్ ప్రదేశ్ లోని అనేక వర్గాలు ఇబ్బందులు పడుతున్నాయన్నారు. మొత్తం మీద ఎన్నికల ప్రచారం ముగుస్తున్న వేళ హిమాచల్ ప్రదేశ్ లో పొలిటికల్ హీట్ పెరిగింది.

Similar News