యువతను టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది :ఉత్తమ్‌

Update: 2016-04-12 23:59 GMT

మహాత్మా జ్యోతిరావు పూలే స్పూర్తితో యువత ముందుకు సాగాలని తెలంగాణ కాం గ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం గాంధీభవ న్‌లో పూలే జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం ఉత్తమ్‌కుమార్ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే గొప్ప సంఘ సంస్కర్త అంటూ కొనియాడారు. విద్యతోనే అభివృద్ది సాధ్యమని పూలే పేద వర్గాలను విద్యను అభ్యసించే విధంగా కృషి చేశారని తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే అన్ని రంగాలలో అభివృద్ది చెందుతామని భావించిన యువతను టీఆర్ఎస్ ప్రభుత్వం నిరాశ పరిచే విధంగా వ్యవహరిస్తోందన్నారు. జనాభాలో అధిక శాతం ఉన్న బీసీలకు సబ్‌ప్లాన్‌ను అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. బీసీల సంక్షేమానికి రూ.25వేల కోట్లు ఖర్చు చేస్తామని, నామ మాత్రపు కెటాయింపులతో బీసీలను మోసం చేస్తోందని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఇది బీసీ వ్యతిరేక ప్రభుత్వమని ఉత్తమ్‌కుమార్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.

Similar News