మోదీ మాటల్లో ద్రోహం తెలుస్తోంది!

Update: 2016-09-26 00:18 GMT

మన రాష్ట్రానికి ప్రత్యేకహోదాను ఇవ్వలేదు గనుక.. అందులో ఏం ఉన్నదిలే అంటూ.. కేంద్ర నాయకులు మనల్ని మభ్యపెట్టడానికి ప్రయత్నించి ఉండవచ్చు .. కానీ జాతీయ అంతర్జాతీయ వేదికలమీద మాటల్లో కొన్ని సంగతులు అనుకోకుండా బయటపడుతుంటాయి. కోజికోడ్‌లో జరిగిన భాజపా జాతీయ సమావేశం సందర్భంగా కూడా అలాంటిదే జరిగింది. ప్రధాని మోడీ ప్రసంగంలో అంతర్లీనంగా, ఇండైరక్టుగా హోదాకు ఉన్న ప్రాధాన్యం, అభివృద్ధి కి అది వెన్నెముక కాగల అంశం వెలుగుచూసింది.

ఆయన కోజికోడ్‌లో మాట్లాడుతూ.. దేశమంతా సమానంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. పశ్చిమ భారతం లాగా ఈశాన్య భారతం కూడా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే అక్కడ ప్రత్యేక శ్రద్ధ పెట్టాం అంటూ మోడీ వ్యాఖ్యానించారు. నిజానికి ఈశాన్య రాష్ట్రాల్లో ప్రత్యేకహోదా అమల్లో ఉంది. అంటే తులనాత్మకంగా చూస్తే.. వేగవంతమైన అభివృద్ధికి ప్రత్యేకహోదా ఒక ఆధరవు అని మోడీ చెప్పకనే చెప్పినట్లు అయింది.

అదే సమయంలో ఏపీకి హోదా ఇచ్చే విషయంలో మాత్రం మోదీ అండ్‌ కో వంచనమార్గం అవలంబిస్తున్న సంగతి తెలిసిందే. ఈశాన్య భారతమంత వెనుకబాటు ప్రాంతం కాకపోయినా, ప్రత్యేక పరిస్థితుల్లో తాము కోరుకోని విభజన కు బాధితులుగా, దారిద్య్రంలో ఏర్పడిన రాష్ట్రానికి హోదా వెసులుబాటును వారు న్యాయబద్ధంగా కొన్నాళ్లు కల్పించాల్సి ఉన్నా.. రిక్త హస్తం చూపించేశారు.

Similar News