మోదీ బలం ఏంటో...దీన్నిబట్టే....?

Update: 2018-08-06 07:08 GMT

ఇంతకాలం ఎదురు చూస్తున్న రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ పదవికి ఎన్నిక తేదీ ఖరారయింది. ఈ నెల9వ తేదీన రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక జరగనున్నట్లు ఛైర్మన్ వెంకయ్య నాయుడు ప్రకటించారు. ఎల్లుండి మధ్యాహ్నం 12గంటల వరకూ మాత్రమే నామినేషన్లను స్వీకరిస్తారు. రాజ్యసభలో డిప్యూటీ ఛైర్మన్ పదవి కోసం విపక్షాలన్నీ ఏకమైతే బీజేపీకి కొంత కష్టమేననిచెప్పాలి.

కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో.....

ఇప్పటికే వైసీపీ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికలో తాము బీజేపీకి మద్దతివ్వలేమని చెప్పేసింది. శివసేన నుంచి గాని, మరో మిత్రపక్షం నుంచి గాని అభ్యర్థిని నిలబెట్టాలన్నది బీజేపీ ఆలోచన. కాంగ్రెస్ కూడా తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిని నిలపాలన్న ఆలోచన చేస్తుంది. మొత్తం మీద రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక ఖరారు కావడంతో ఇప్పుడు అధికార, విపక్షాల మధ్య రసవత్తరమైన పోరు జరగనుంది. పీజే కురియన్ పదవీ విరమణతో ఈ ఎన్నిక జరగనుంది.

Similar News