మా గొంతు నొక్కేందుకే ఎమెల్యేలను కొనుగోలు చేస్తున్నారు !

Update: 2016-04-01 15:33 GMT

ప్రజల తరపున నిలదీసేది ప్రతిపక్షం అని, ఆ ప్రతిపక్షం వాయి స్‌ను మూసివేయించేందుకు తమ పార్టీ ఎమ్మెల్యేలను చంద్రబాబు నాయుడు కొంటున్నా రని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. 2010లో కిరణ్ కుమార్ రెడ్డిపై అవిశ్వాసం పెడితే మద్దతిచ్చిన 18మంది ఎమ్మెల్యేలు పదవులు పోతాయని తెలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశారని పేర్కొన్నారు. 18మంది అనర్హత వేటుకు గురై మళ్ళీ ఎన్నికలు వెళ్తే 15మందిని గెలిపించుకున్నామని వైఎస్ జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆయన గురువారం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాటా ్లడారు. వ్యక్తిత్వం, విశ్వసనీయత లేని వ్యక్తి చంద్రబాబు నాయుడు అని విమర్శిం చారు. హామీలిచ్చి అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేయటం చంద్ర బాబు విశ్వసనీయత అని ధ్వజమెత్తారు. చంద్రబాబుకు ప్రస్తుతం 102మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, మరో 10మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేయటం వల్ల ఒరిగేది ఏమీలేదన్నారు. 10మంది తమ పార్టీ ఎమ్మెల్యేలు అధికార పార్టీ బెంచీల్లో కూర్చున్నా, 67మంది వైసిపి ఎమ్మెల్యేలు ఓటింగ్‌లో పాల్గొన్నారని స్పీకర్ అంటున్నారని జగన్ పేర్కొన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించే ధైర్యం బాబుకు లేదన్నారు. ప్రజల్లో ఓడిపోయారని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి అని ఆయన పేర్కొన్నారు. స్పీకర్‌ను అడ్డు పెట్టుకుని చంద్రబాబు అన్యాయాలు చేస్తున్నారని ఆక్షేపించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు మీరిచ్చిన హామీలు అమలు చేశారా లేదనా అన్నదానిని చూసే ఓట్లేస్తారనీ, ఎమ్మెల్యేలను కొంటే జనం ఓట్లేయరని బాబును ఉద్దేశించి అన్నారు. కోర్టు తీర్పును పట్టించుకోని పరిస్థితి అసెంబ్లీలో ఉందన్నారు. అసెంబ్లీలో నిబంధనలను, రూల్స్‌ను కాలరాస్తున్నారని విమర్శించారు. వేరే పార్టీ బీఫామ్‌పై గెలిచిన ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి కొనుగోలు చేసి, అనర్హత వేటు వేయని పరిస్థితిని చూస్తున్నామన్నారు. అవిశ్వాసంపై నోటీసు ఇస్తే 15 రోజుల తర్వాత తీసుకోవాలి, కానీ స్పీకర్ పై అవిశ్వాసాన్ని అదేరోజు తీసుకున్నారని పేర్కొన్నారు. అప్పటికప్పుడే చర్చకు తీసుకుని రూల్స్ సస్పెండ్ చేశారని విమర్శించారు. చంద్రబాబుపై అవిశ్వాసం పెడితే ప్రభుత్వాన్ని కాపాడేందుకు అప్పుడే చర్చకుపెట్టి డివిజన్ లేకుండా స్పీకర్ చేశారని ధ్వజమెత్తారు. ద్రవ్య వినిమయ బిల్లులో డివిజన్ కోరినా పట్టించుకోలేదన్నారు. బడ్జెట్‌లో చాలీచాలని కేటాయింపులు చేసి ఆ బిల్లుపై ఓటింగ్ లేకుండా చేసి పాస్ చేయించారని విమర్శించారు.

Similar News