మన్మోహన్ ఏపీ ప్రజలకు అన్యాయం చేశారా?

Update: 2017-01-30 06:28 GMT

పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించే విషయంలో కాంగ్రెస్‌ పార్టీపై మంత్రి దేవినేని ఉమ సంచలన ఆరోపణలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన బిల్లులో జాతీయ హోదాగా ప్రకటించిన తర్వాత పోలవరం ప్రాజెక్ట్ కు పాలనాపరమైన అమోదం కోసం 2014 మార్చి2న కేబినెట్‌ ముందుకు వచ్చిందని., అయితే నాటి ప్రధాని మన్మోహన్‌ దానికి అమోదం తెలపకుండా తిప్పి పంపారని దేవినేని ఉమ ఆరోపించారు. యూపీఏ ప్రభుత్వం రాష్ట్రాన్ని విడదీసి ఏపీ విషయంలో సరైన న్యాయం చేయకుండా చేతులు దులుపుకుందన్నారు.

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన ఆర్డినెన్స్‌ను ఉద్దేశపూర్వకంగా జూన్‌2కు వాయిదా వేయడంతో పరిస్థితి సంక్లిష్టంగా మారిందన్నారు. జూన్‌2న ఉమ్మడి రాష్ట్రం విడిపోయి రెండు రాష్ట్రాలు మనుగడలో వచ్చాక ఈ ఆర్డినెన్స్‌ తీసుకురావాలంటే కష్టమయ్యేదన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే పోలవరం ముంపు మండలాలను ఏపీలో విలీనం చేయడం., జాతీయ హోదా ఆర్డినెన్స్‌లకు సంబంధించి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్‌ నేతలకు బీజేపీ-టీడీపీలపై విమర్శించే హక్కు లేదన్నారు.

Similar News