భారత్ సైన్యం దూకుడు : సరిహద్దుల్లో ఉ్రదిక్తం

Update: 2016-09-29 10:24 GMT

భారత సైన్యం అసలు సిసలు దూకుడును ప్రదర్శించింది. పాకిస్తాన్ భూభాగంలోకి చొరబడి.. అక్కడి ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసిన ఏకంగా 38 మందిని మట్టుపెట్టింది. పారా కమాండోస్ నిర్వహించిన ఈ దాడిలో 7 గురిని బంధించారు. 8 ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశారు. పీఓకే లోని ఉగ్రవాద శిబిరాల మీద కూడా దాడులు జరిగాయి. పర్యవసానంగా సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంటోంది.

తమను బలహీనులుగా అనుకోవద్దని ఇరుదేశాల మధ్య శాంతి నెలకొనాలని కోరుకుంటున్నాం అని పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ వెల్లడించారు. పాక్ వైపు నుంచి 20 చొరబాట్లను అడ్డుకున్నాం అని.. వైమానిక దాడులు జరిగాయి అని .. ఆ వివరాలను ఇప్పటికే పాకిస్తాన్ కు కూడా తెలియజేశాం అని సైనికాధికారులు ప్రకటించారు.

భారత్ సైన్యం దాడుల నేపథ్యంలో సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి. అంతర్జాతీయ సరిహద్దుల నుంచి పది కిలోమీటర్ల ఈవలకు ఉన్న గ్రామాల్లోంచి ప్రజలను బీఎస్ ఎఫ్ జవాన్లు ఖాళీ చేయిస్తున్నారు. ఏ సమయంలోనైనా ఎలాంటి ఉద్రిక్తతలైనా చోటు చేసుకోవచ్చునని అనుకుంటున్నారు.

Similar News