బీజేపీ మహిళ నేతపై మాజీ ఎమ్మెల్యే అత్యాచారం?

Update: 2017-02-23 20:30 GMT

భారతీయ జనతా పార్టీ మాజీ ఎమ్మెల్యే పై అత్యాచారం కేసు నమోదయింది. తనను రిసార్ట్స్ కు పిలిచి మత్తుమందిచ్చి అత్యాచారం చేశారని ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే విజయ్ జోళీ తనపై అత్యాచారానికి పాల్పడ్డు ఆ మహిళ ఫిర్యాదులో పేర్కొంది. ఈ నెల 10వ తేదీన గుర్గాంలోని అప్నా ఘర్ రిసార్ట్స్ విజయ్ తనను పిలిపించారని, తనకు మత్తు మందు ఇచ్చి తనపై అత్యాచారానికి పాల్పడ్డారని బాధిత మహిళ పోలీసులకు తెలిపిన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో ఈ మాజీ ఎమ్మెల్యేపై ఢిల్లీ పోలీసులు 376, 328, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తాను ఎవరికైనా ఈ విషయాన్ని చెబితే చంపేస్తానని కూడా జోళీ తనను బెదిరించారని ఆ మహిళ చెబుతున్నారు. ఈ సంఘటన బీజేపీలో కలకలం రేగింది.

తనను బ్లాక్ మెయిల్ చేసింది....

అయితే విజయ్ జోళీ వాదన వేరేలా ఉంది. తనను రాజకీయంగా దెబ్బతీసేందుకే కొందరు కుట్ర పన్ని ఒక మహిళ చేత తనపై కేసు పెట్టించారని ఆరోపిస్తున్నారు ఈ మాజీ ఎమ్మెల్యే. ఆ మహిళపై జోళీ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. తాను అత్యాచారం చేసినట్లు వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. తనపై ఫిర్యాదు చేసిన మహిళ బీజేపీ నాయకురాలేనని, ఆమెను ఫిబ్రవరి 10 వ తేదీన రిసార్ట్స్ లో కలిసిన మాట వాస్తవమేనని అంగీకరించారు జోళీ. తనకు ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని సదరు బీజేపీ మహిళా నేత తనను డిమాండ్ చేశారని, తాను ఇవ్వకపోవడంతో తనపై రేప్ కేసు పెట్టిందని విజయ్ జోళీ ఆరోపిస్తున్నారు. డబ్బులు ఇవ్వకపోతే రేప్ కేసు పెడతానని కూడా ఆమె హెచ్చరించిందని చెప్పారు. దీనిపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు ఆ మహిళపై కూడా విజయ్ ఫిర్యాదు ఆధారంగా బెదిరింపులు, ఛీటింగ్ కేసులు నమోదు చేశారు. దీనిపై పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నామని గుర్గాం పోలీస్ కమిషనర్ తెలిపారు. విచారణలో వాస్తవాలు బయటపడతాయని ఆయన చెప్పారు.

Similar News