ప్రియాంక షరతులకు అఖిలేష్ ఓకే

Update: 2017-01-22 06:29 GMT

ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్, సమాజ్ వాదీ పొత్తు కుదిరింది. రెండు పార్టీలూ సంయుక్తంగా ఎన్నికల బరిలోకి దిగనున్నాయి. కాంగ్రెస్ 105 సీట్లు, సమాజ్ వాది పార్టీ 298 సీట్లలో పోటీ చేయనుంది. ఈ మేరకు రెండు పార్టీల మధ్య జరిగిన చర్చ పొత్తులు ఫలించాయి. నిన్నటి వరకూ రెండు పార్టీల మధ్య పొత్తు కుదురుతుందా? లేదా? అనే సందేహాలు విన్పించాయి. అయితే ప్రియాంక గాంధీ జోక్యంతోనే రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరినట్లు తెలుస్తోంది.

ఇటీవల కాంగ్రెస్, ఎస్పీ మధ్య పొత్తు ఉంటుందని కాంగ్రెస్ సీనియర్ నేత ఆజాద్ ప్రకటించినా నామినేషన్ల గడువు ముగుస్తున్నా చర్చలు ముందడగు పడలేదు. కాంగ్రెస్ కు బలమైన అమేధీ, రాయబరేల్లోనూ ఎస్పీ అభ్యర్ధులను ప్రకటించడంతో పొత్తు ఇక లేనట్లేనని భావించారు. అయితే ప్రియాంక తన ప్రతినిధిని పంపి రెండు పార్టీల మధ్య చర్చలు ఫలప్రదమయ్యేందుకు కృషి చేశారు. మొత్తం మీద యూపీ ఎన్నికల్లో ఇక త్రిముఖ పోటీయే నెలకొంది.

Similar News