ప్యాకేజీ కి చట్టబద్ధతపై చంద్రబాబు ఆరా

Update: 2017-02-27 18:29 GMT

ఏపీకి ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించే అంశం రానున్న కేంద్ర మంత్రిమండలి సమావేశం అజెండాలో తప్పనిసరిగా వుండేలా సంబంధిత ముఖ్యులతో మాట్లాడాలని సూచించారు. జల వనరులు, రహదారులకు సంబంధించి రాష్ట్రంలో చేపట్టిన భారీ ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేయడానికి నిధుల కొరత రానివ్వరాదని తేల్చారు. రాష్ట్రానికి ఎంత మేర ఆదాయం సమకూరుతున్నదీ, ఏఏ పథకాలు, కార్యక్రమాలకు ఎంత మేర నిధుల వ్యయం చేస్తున్నదీ కచ్చితమైన గణాంకాలు అందివ్వాలని ఆర్థికశాఖ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పథకాలన్నింటికీ తగినంతగా నిధుల కేటాయింపు జరగాలని చెప్పారు.ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు అజయ్ కల్లామ్ (ఆర్ధిక), ఇతర అధికారులు పాల్గొన్నారు.

గత సమావేశంలోనూ చోటు లేకుండా....

ఇటీవల జరిగిన కేంద్ర మంత్రి వర్గంలో ఏపీ ప్యాకేజీ అంశం చర్చకు వస్తుందన్న వార్తలొచ్చాయి. లీకేజీలు కూడా వచ్చాయి. టేబుల్ ఐటమ్ కింద వస్తుందని కూడా మరికొందరు చెప్పారు. అయితే కొన్ని మార్పులు, చేర్పుల వల్ల ఈ సమావేశం అజెండాలో ఇది చేర్చలేదని కేంద్ర ప్రభుత్వ అధికార వర్గాలు వెల్లడించాయి. ఈసారైనా ప్యాకేజీకి చట్టబద్ధత వచ్చేలా కృషి చేయాలని అధికారులకు సూచించడమే కాకుండా...ముఖ్యమంత్రి కేంద్రమంత్రులతో కూడా మాట్లాడినట్లు తెలుస్తోంది.

Similar News