పోలీస్ బాస్ ఎన్ని కష్టాలు పడ్డారు...?

Update: 2017-11-11 02:30 GMT

తెలంగాణ రాష్ట్రానికి కొత్త ఇంచార్జీ డిజిపిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు ముదిరెడ్డి మహేందర్ రెడ్డి. 1986 బ్యాచ్ కి చెందిన మహేందర్ రెడ్డి. 30 యేళ్లుగా వివిధ హోదాలో పని చేశారు. ఎక్కడ పని చేసినా తనదైన శైలితో ముద్రవేసుకునే మహేందర్ రెడ్డి మధ్యతరగతి రైతు కుటుంబం నుంచి పోలీస్ బాస్ గా ఎలా ఎదిగారో కాబోయే పోలీస్ బాస్ పై స్పెషల్ స్టోరీ.

చివరకు ఆయన పేరే.....

ఐ.పి.ఎస్. అయిన ప్రతి ఒక్కరికి డిజిపి కావాలనే కోరిక బలంగా ఉంటుంది. వారు డిపార్టుమెంట్ కు చేసే అత్యుత్తమ సేవ. వారి ట్రాక్ రికార్డు ఆధారంగా యూపీపీఎస్సీకి పంపిన 6 పేర్లలో ముగ్గురి పేర్లను తిరిగి పంపిస్తుంది. ముగ్గిరి పేర్లలో ఒక్కరిని రెగ్యూలర్ డిజిపిగా నియమిస్తారు. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు విచక్షణ అధికాారాలతో లిస్టు పంపకుండానే ఇంచార్జీ డీజీపీలను నియమిస్తారు. తమకు అనుకూలంగా వ్యవహరించే వారినే డిజిపిగా పెట్టుకుంటారు సి.ఎం. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాడిన తర్వాత రెండో డీజీపీ ఎవరనేది ఉత్కంఠకు తెరపడింది. ముదిరెడ్డి మహేందర్ రెడ్డి పేరును సి.ఎం. ఫైనల్ చేసి జీ.వో. విడుదల చేయబోతున్నారు.

తెలంగాణ ఉద్యమ సమయంలోనూ...

మహేందర్ రెడ్డి సి.ఎం. కేసిఆర్ కు నమ్మిన బంటు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఇంటిలిజెన్స్ ఛీప్ గా పని చేశారు. అప్పటి సి.ఎం.కు సన్నిహితంగా ఉంటూ.. కేసిఆర్ కు తెలంగాణలో ఉన్న పరిస్థితుల పై సమాచారం ఇచ్చే వారు. అసెంబ్లీ ముట్టడి సమయంలో మహేందర్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన సమాచారమే తెలంగాణ వచ్చేందుకు ఎంతో తొడ్పడిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతూ ఉంటుంది. 2009 నుంచి 2014 వరకు ఇంటిలిజెన్స్ ఛీప్ గా ఎంతో సమర్ధవంతంగా పని చేశారు.

మధ్యతరగతి కుటుంబం.....

కుటుంబంలో మహేందర్ రెడ్డి అందరికన్నా చిన్నవారు. తండ్రి ముదిరెడ్డి నారాయణ రెడ్డి, తల్లి లచ్చమ్మ ఇదర్దు అన్నలు, ముగ్గురు అక్కలు. తండ్రి గ్రామ పంచాయితీ వార్డు మెంబర్ గా పనిచేశారు. మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం. పెద్ద సోదరుడు వెంకటరెడ్డి గ్రామంలోనే ఇంకా వ్యవసాయం చేస్తున్నారు.. వైస్ ఎం.పీ.పీగా పని చేశారు. రెండో సోదరుడు ముదిరెడ్డి రామచంద్రరెడ్డి, ఎన్.ఎఫ్.సీ లో ఛీప్ ఇంజనీరింగ్ గా చేసి మూడేళ్ల క్రితం రిటైర్డ్ అయ్యారు. ముగ్గురు అక్కల పెళ్లిలు అయ్యాయి.

చింతచెట్టు కిందే చదువు....

ఏడో తరగతి వరకు కిష్టాపురంకు 4 కిలో మీటర్ల దూరం ఉన్న కూసుమంచి మండల కేంద్రంలో చదువుకున్నారు. రోజు నాలుగు కిలోమీటర్లు బురదలో నడుచుకుంటూ వెళ్లి చదువు కొనసాగించారు. పాఠశాలలో చింత చెట్టుకిందనే పాఠాలు చెప్పేవారు. స్కూల్ కు పక్కా భవనం లేకపోవడంతో 7 వ తరగతి వరకు చింత చెట్టు కిందనే చదువుకున్నారు. ఏడో తరగతి నుంచి 10 వరకు నల్గోండ జిల్లాలోని సంస్థాన్ నారాయణ్ పుర్ మండలం లోని అంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయం సర్వే లో చదివారు. ఇక్కడే మహేందర్ రెడ్డి భవిష్యత్తుకు పునాదులు పడ్డాయి. ఒక మంచి ఉద్యోగం సంపాదించాలనే తపన కల్గింది. ఆ తర్వాత నాగార్జున సాగర్ లోని గురుకుల పాఠశాలలో ఇంటర్ వరకు చదివారు.. వరంగల్ లో బి.ఈ. చెసిన అనంతరం సివిల్స్ రాశారు. 1986 వ సంవత్సరం ఐ.పి.ఎస్. గా సెలక్ట్ అయ్యారు.

ఎక్కడ పనిచేసినా.....

ఏఏస్పీ గా 1988 నుంచి 1990వరకు మొదటి పోస్టు కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలో చేశారు. ఆ తర్వాత మరో నెలలు గుంటూర్ టౌన్ లో ఏఎస్పీగా చేశారు. ఏడాది పాటు బెల్లంపల్లిలో అడిషనల్ ఎస్పీగా పని చేశారు. 1991 నుంచి 1993 వరకు నిజామాబాద్ ఎస్పీగా ఉన్నారు.1993 నుంచి 1995 వరకు కర్నూలు ఎస్పీ, 1995 నుంచి 1998 వరకు మూడేళ్లు ఈస్ట్ జోన్ డి.సి.పిగా పనిచేశారు. నేషనల్ పోలీస్ అకాడమిలో అసిస్టెంట్ డైరెక్టర్ గా అడిషనల్ డైరెక్టర్ గా 1998 నుంచి 2003 సంవత్సరం వరకు ఉన్నారు. ఇప్పటికి ట్రైనీ ఐ.పీ.ఎస్.లకు లెక్చరర్ గా తరగతులు తీసుకుంటారు. అప్పుడే ఎర్పాడిన సైబరాబాద్ కమిషనరేట్ కు మొట్టమొదటి కమిషనర్ గా పనిచేశారు. 2003నుంచి 2007 వరకు నాలుగేళ్లు సుదీర్ఘంగా సేవలు అందించి.. ఆసియాలోనే అతిపెద్ద కమిషనరేట్ ను దారిలో పడేలా చేశారు. ఆ తర్వాత ఏడాదిన్నర ఐ.జీ. కంఫ్యూటర్స్ సర్వీస్ లో ఉన్నారు. మావోయిస్టుల ఏరివేతలో ఎంతో కీలకమయిన గ్రేహౌండ్స్ చీఫ్ గా ఏడాది పాటు పని చేశారు. ఇక ఐ.జీ.గా ఇంటిలిజెన్స్ లో 2009లో చేరి అడిషనల్ డిజిపిగా పదోన్నతి 2014 జూన్ 2 వరకు కొనసాగారు. 5 ఏళ్లు నిఘా వ్యవస్థలో పనిచేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత గుండెకాయలాంటి హైదరాబాద్ కు కమిషనర్ గా అయ్యారు. మత ఘర్షణలు, శాంతిభద్రతలకు తనదైన శైలిలో టెక్నాలజీని అభివృద్ది చేసి అరచేతిలో లా అండ్ అర్డర్ ను తీసుకోచ్చారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ తో పాటు.. పాతబస్తీలో బాలకార్మికుల విముక్తి , షీ టీం. పోలీస్ స్టేషన్ లో రిసెప్షనిస్ట్ కల్చర్.. కాంట్రాక్ట్ మ్యారేజీల పై ఉక్కు పాదం మోపారు. సీ.సీ. కెమెరాలతో నేర నియంత్రణ, చైన్ స్నాచర్ల పై పి.డీ. యాక్ట్, అన్నింటికి మించి ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా పోలీస్ అధికారులకు బదిలీల్లో ఫైరవీలకు స్థానం లేకుండా చేయడం సి.పి.గా ఎన్నో విజయాలు సాదించారు. ఆ పని తీరే ఇప్పుడు డిజిపి పోస్టుకు రేసులో ముందుంచింది. భార్య అనిత గృహిణి. ఒక కుమారుడు, ఒక కుమార్తె. కుమారుడు అమెరికాలో సాప్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేశారు. హైదరాబాద్ లో స్టార్టప్ కంపెనీ ఏర్పాటు చేసేందుకు హైదరాబాద్ కు వచ్చి ఇక్కడే ఉంటున్నారు. కుమార్తె ప్రయివేట్ జాబ్ లో ఉన్నత స్థానంలో ఉన్నారు. ఆల్ ది బెస్ మహేందర్ రెడ్డి గారూ....!

Similar News