నేడు స్పీడ్ పెంచనున్న జగన్

Update: 2017-11-08 00:30 GMT

జగన్ ప్రజాసంకల్పం పాదయాత్ర మూడోరోజు కొనసాగనుంది. కమలాపురం నియోజకవర్గంలోని నీలతిమ్మాయ పాలెం నుంచి ప్రారంభమయ్యే నేటి యాత్ర మూడో రోజు 16.2 కిలోమీటర్ల మేరకు సాగనుంది. తొలిరోజు 8.9కిలో మీటర్లు, రెండోరోజు 12.2 కిలోమీటర్లు నడిచిన జగన్ మూడోరోజు మాత్రం స్పీడ్ పెంచనున్నారు. మూడోరోజు నీలతిమ్మాయపాలెం నుంచి పాదయాత్ర ప్రారంభమై పాలగిరి జంక్షన్ క్రాస్ రోడ్డుకు చేరుకుంటుంది. సంగమేశ్వర దేవాలయం జంక్షన్ లో జగన్ ప్రసంగించనున్నారు.

నేడు 16 కిలోమీటర్ల నడక...

అక్కడి నుంచి సంగాలపల్లి గ్రామానికి జగన్ చేరుకుంటారు. అక్కడ భోజనానికి ఆగుతారు. తర్వాత మధ్యాహ్నం 3గంటలకు సంగాలపల్లి పుంచి ప్రారంభమై గంగిరెడ్డి పల్లి, అయ్యవారిపల్లి చేరుకుంటారు. రాత్రికి ఉరుటూరు గ్రామానికి చేరుకుంటారు. అక్కడే రాత్రికి బస చేస్తారు. మధ్యలో అనేక కులసంఘాలతో సమావేశం అవుతారు. ప్రజలతో మమేకమవుతారు. వైఎస్ జగన్ వెంట ఇప్పటికే యాభై వేల మంది వివిధ నియోజకవర్గాల నుంచి వచ్చి జగన్ వెంట పాదయాత్రలో పాల్గొంటున్నారు. వైసీపీ ముఖ్య నేతలు కూడా కొందరు జగన్ వెంట నడుస్తున్నారు.

Similar News