నేడు తేలిపోనుందా?

Update: 2017-02-16 03:57 GMT

తమిళనాడులో రాజకీయ అనిశ్చితికి ఈరోజు తెరపడే అవకాశముంది. పళనిస్వామి, పన్నీర్ సెల్వం లలో ఒకరిని ఈరోజు ఆహ్వానించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అయితే పళనిస్వామికే ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశమున్నట్లు చెబుతున్నారు. పళనిస్వామికే ఎక్కువ మంది మద్దతు ఉండటంతో ఆయనకే ఛాన్స్ ఉంటుందంటున్నారు. పళనిస్వామి తనకు 123 మంది మద్దతు ఉందని చెబుతున్నారు. ఈ మేరకు వారి సంతకాలతో కూడిన లేఖను గవర్నర్ కు అందించారు.

పళనికే ఛాన్స్....

అయితే పన్నీర్ సెల్వం వాదన మరోలా ఉంది. పళనిస్వామి ఎమ్మెల్యేలను బెదిరించి బలవంతంగా సంతకం చేయించుకున్నారంటున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు 118 మంది ఎమ్మెల్యేలు మద్దతు అవసరం. అయితే పళనిస్వామి చేత ప్రభుత్వం ఏర్పాటు చేయించి ఆ తర్వాత సభలో బలనిరూపణ చేసుకోమంటారా? లేక నేరుగా ఇద్దరినీ బలనిరూపణ సభలోనే చేసుకోమంటారా? అని గవర్నర్ నిర్ణయం మీద ఆధారపడి ఉంది. మొత్తం మీద తమిళనాడు రాజకీయం రోజుకో మలుపులు తిరుగుతున్న సందర్భంలో ఈరోజు కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశముంది.

Similar News