నిరసనకారులపై కేసులు ఫైల్ చేస్తున్న ముఖ్యమంత్రి

Update: 2017-02-19 21:30 GMT

అనేక మలుపులు తిరిగిన తరువాత ఒక కొలిక్కి వాచినట్టు కనిపిస్తున్న తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు మరింత కఠినంగా మారిపోతున్నాయి. జయలలిత మరణానంతరం అన్న డి.ఎం.కే పార్టీ వ్యవహారాలలో వచ్చిన అంతర్గత కలహాల కారణంగా బైట రాష్ట్రాలకు అసలు పరిచయం లేని పలని స్వామి కి ముఖ్యమంత్రి పదవి దక్కింది. మరో వైపు శశికళకి వీరవిధేయుడిగా వున్న ఈ ప్రస్తుత ముఖ్యమంత్రికి తన గాడ్ ఫాదర్ ఐన చినమ్మ శశికళ జైలు శిక్ష అమలులోకి వచ్చిన వెంటనే శాసన సభ లో బాల పరీక్ష ఎదుర్కొని నిరూపించుకోవాల్సి వచ్చింది. అయితే ఈ పరీక్షను గట్టెక్కిన పలని స్వామి కి ప్రతిపక్ష నేతలు చేపడుతున్న రాష్ట్ర వ్యాప్త నిరసనలు తల నొప్పిగా మారుతున్నాయి.

శాసన సభ లో తన బలాన్ని నిరూపించుకునే ప్రక్రియ చట్ట ప్రకారం చేయలేదని, ఎన్నో అవకతవకలు చోటుచేసుకున్నాయని, అందు వల్ల కొత్త ముఖ్యమంత్రి నియామకం రాజ్యాంగ విరుద్ధం అని ఆరోపిస్తున్న ప్రతిపక్ష నేత స్టాలిన్ తన నిరసన తెలపటానికి మెరీనా బీచ్ లోని గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేపట్టగా ఈ నిరసన ఉధృతం కాకముందే అణచివేయాలని యోచిస్తున్న తమిళనాడు ప్రభుత్వం స్టాలిన్ పై కేసు నమోదు చేపించి నిరసన కార్యక్రమాన్ని నిలిపి వేసింది. దీనితోపాటు డి.ఎం.కే పార్టీ కార్యకర్తలు చేపడుతున్న నిరసనాలలో భాగంగా మధురై, కోయంబత్తూరు, ఈరోడ్, శీలం వంటి నగరాలలో కూడా ప్రతిపక్ష నేతలతో పాటు కార్యకర్తలపై కూడా ఎఫ్.ఐ.ఆర్ లు నమోదు చేసి ప్రతిపక్ష బలాన్ని అణచివేస్తున్నారు. శశికళ లేని సమయంలో ప్రభుత్వం డిఫెన్స్ లో పడే ప్రమాదాన్ని కొని తెచ్చుకోకూడదనే ఆలోచనతోనే కొత్త ముఖ్యమంత్రి ఇంతటి కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ వర్గాలలో కూడా అసంతృప్తి సెగలు రేగుతున్నాయి.

Similar News