తూర్పు తాళ్ళు, పెద మైనవానిలంక రూపు రేఖలు మార్చిన సీతరామన్!

Update: 2016-04-01 15:32 GMT

నిర్మలాసీతారామన్ చొరవతో సోలార్ గ్రామాలుగా తూర్పు తాళ్ళు, పెద మైనవానిలం రూపుదిద్దుకోనున్నాయి. ఆ గ్రామాల్లో సౌరశక్తి వెలుగులు విరజిమ్మనున్నాయి. ఓ ప్రైవేటు సంస్థ అభివృద్ధి చేసే రెండు మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ సహాయంతో ఈ ఏడాది నుంచే పూర్తి శాతం సోలార్ విద్యుత్ వినియోగంలోకి రానుంది. దీంతో దేశంలోనే వందశాతం సోలార్ విద్యుత్తును వినియోగించే మొట్ట మొదటి గ్రామాలుగా ఆ రెండు గ్రామాలు గుర్తింపును తెచ్చుకోనున్నట్లు వాణిజ్య, పరిశ్రమల శాఖామంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. సంసద్ ఆదర్శ గ్రామ యోజన (ఎస్ ఏ జీ వై) ద్వారా ఆ రెండు గ్రామాలను తాను దత్తత తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం తూర్పుతాళ్ళు, పెద మైనవానిలంక గ్రామాలు ఇప్పుడు దేశంలోనే మొట్టమొదటి సోలార్ గ్రామాలుగా అభివృద్ధి చెందనున్నాయి. సౌరశక్తిని వినియోగించి గ్రామాల్లో పూర్తిశాతం విద్యుత్ సరఫరా జరిపేందుకు యుద్ధ ప్రాతిపదికన సన్నాహాలు జరుగుతున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ డిస్కమ్ సహాయంతో రెండు మెగావాట్ల సోలార్ పవర్ ను ఉత్పత్తి చేసి గ్రామాల్లో పూర్తిశాతం సోలార్ విద్యుత్తును అందించేందుకు సంస్థ సిద్ధం చేస్తోంది. ప్లాంట్ ద్వారా ఉత్పత్తి అయిన 2 మెగావాట్ల సోలార్ విద్యుత్తును ఆంధ్ర ప్రదేశ్ తూర్పు పవర్ డ్రిస్టిబ్యూషన్ కంపెనీ కొనుగోలు చేసి గ్రామాలకు సరఫరా చేస్తుంది. సోలార్ ప్లాంట్ నిర్మాణం కోసం జిల్లా యంత్రాంగం భూమిని కేటాయించగా ప్లాంట్‌లో ఉత్పత్తి అయ్యే విద్యుత్తును కొనుగోలు చేసేందుకు ఏపీఈపీడీసీఎల్ అంగీకారం తెలిపింది. ప్లాంట్ నిర్మాణం 2016 ఆగస్టుకి పూర్తి కానున్నట్లు సమాచారం.

పరకాల, నిర్మలా సీతారామన్‌కు గ్రామస్తుల కృతజ్ఞతలు : ఏపి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు తూర్పుతాళ్ళు, పెద మైనవానిలం గ్రామస్థులు కృతజ్ఞతలు తెలుపుకొంటున్నారు. వీరి చొరవ వల్ల తమ గ్రామాల్లో సోలార్ వెలుగులు వెలుగుతున్నాయని వారు పేర్కొన్నారు. వీరు చొరవ తీసుకోకపోయివుంటే తమ గ్రామాలు ఇంకా అంధాకారంలోనే ముగ్గుతుండేవని వారు పేర్కొన్నారు. పరకాల ప్రభాకర్‌కు, నిర్మలా సీతారామన్‌కు తాము ఎప్పటికీ రుణపడి ఉంటామని ఆ గ్రామస్థులు పేర్కొంటున్నారు.

Similar News