తమిళనాడు సచివాలయంలో మంత్రాంగం

Update: 2017-02-13 09:30 GMT

తమిళనాడు సచివాలయంలో ఈరోజు ఆశ్చర్యకరమైన సంఘటన చోటు చేసుకుంది. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఈరోజు సచివాలయానికి చేరుకున్నారు. పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన తర్వాత సెక్రటేరియట్ వైపుకు వెళ్లలేదు. అన్నాడీఎంకేలో తిరుగుబాటు జెండా ఎగరేసిన పన్నీర్ వారం రోజుల నుంచి ఇంటి వద్దనే ఉంటున్నారు. తనను ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని గవర్నర్ కోరినా ఆయన పరిపాలన వైపు దృష్టి పెట్టలేదు. తన అనుచరులతో, సహచర ఎమ్మెల్యేలతో, ఎంపీలతో మంతనాలు మాత్రమే జరుపుతున్న పన్నీర్ అకస్మాత్తుగా ఇవాళ సచివాలయానికి చేరుకోవడం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. పన్నీర్ ఏం నిర్ణయం తీసుకుంటారోనని శశికళ వర్గీయులు బెంబేలెత్తి పోతున్నారు.

డీఎంకే స్టాలిన్ కూడా....

మరోవైపు డీఎంకే నేత స్టాలిన్ కూడా సోమవారం సచివాలయానికి వచ్చారు. అయితే ఇద్దరూ కలిసి ఇక్కడే మంత్రాంగం నెరుపుతారా? అన్న ఉత్కంఠ నెలకొంది. డీఎంకే తొలినుంచి పన్నీర్ కు మద్దతు పలుకుతూ వస్తోంది. పన్నీర్ కు సపోర్ట్ గానే డీఎంకే స్టేట్ మెంట్లు ఉంటున్నాయి. పన్నీర్ కు అవసరమైన సంఖ్యాబలం లేకుంటే డీఎంకే మద్దతిస్తుందని తమిళనాడులో పెద్దయెత్తున ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వీరిద్దరు కలిసి తాజా రాజకీయ పరిస్థితులపైచర్చిస్తారా? లేదా? అన్నది ఇంకా తేలలేదు. అలాడే ఈరోజు కూడా శశికళ గోల్డెన్ బే రిసార్ట్ కు వెళ్లనున్నారు. అక్కడ ఉన్న ఎమ్మెల్యేలతో మాట్లాడతారని తెలుస్తోంది. గత రెండు రోజులుగా వరుసగా శశికళ రిసార్ట్ కు వెళ్లి ఎమ్మెల్యేలతో మాటా మంతీ కలిపి వస్తున్నారు. దీంతో వారు జారి పోకుండా ఉంటారన్నది శశి వ్యూహంగా కన్పిస్తోంది. తమ

Similar News