తమిళ రాజకీయాల్లో రాహుల్ వేలు?

Update: 2017-02-10 14:40 GMT

తమిళనాడు రాజకీయాల్లో రాహుల్ తలదూర్చనున్నారా? అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు రాహుల్ మద్దతిస్తారా? ఇదే ఇప్పుడు తమిళనాడులో హాట్ టాపిక్ గా మారింది. తమిళనాడు రాజకీయాలు గంటగంటకూ మారుతుండటతో నేతలు కూడా గతి తప్పుతున్నారు. తమిళనాడు కాంగ్రెస్ నేత తిరునావుక్కరనర్ శశికళకు మద్దతిస్తామని ప్రకటించడంతో ఆ పార్టీ నేతలు షాక్ కు గురయ్యారు. కాంగ్రెస్, డీఎంకే మధ్య తమిళనాడులో సత్సంబంధాలున్నాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తమిళనాడులో ఎనిమిది సీట్లు సాధించుకుంది. అయితే తిరునావుక్కరనర్ ఏ ధైర్యంతో ఈ ప్రకటన చేశారని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.

ఢిల్లీకి వెళ్లిన తిరునావుక్కరనర్

తమిళనాడు మొత్తం శశికళకు వ్యతిరేకంగా ఉంటే.... కాంగ్రెస్ మద్దతు ఎలా ఇస్తుందని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. అయితే తిరునావుక్కరనర్ మాత్రం శశికళకు మద్దతిస్తే తప్పేంటి అని అంటున్నారు. రాహుల్ గాంధీ వద్ద ఈ విషయాన్ని తేల్చుకునేందుకు ఆయన ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. తిరునావుక్కరనర్ గతంలో అన్నాడీఎంకేలోనే ఉండేవారు. అయితే జయలలితతో విభేదించి బయటకు వచ్చేశారు. పాత పరిచయాల కారణంగానే కొందరు శశికళ వర్గీయులు తిరునావుక్కరనర్ మద్దతు కోరడంతో ఆయన ఓకే చెప్పాశారంటున్నారు. అయితే రాహుల్ ఈ విషయంలో ఏ స్టెప్ తీసుకుంటారోనని తమిళనాడు కాంగ్రెస్ నేతలు వేచి చూస్తున్నారు. సభలో బలనిరూపణ జరిగితేనే ఈ సమస్య తలెత్తుతుంది.

Similar News