తండ్రి, తనయుల మధ్య కుదిరిన రాజీ

Update: 2016-12-31 09:19 GMT

యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయంల మధ్య సంధి కుదిరింది. నిన్న అఖిలేష్ ఆయన బాబాయ్ రాంగోపాల్ యాదవ్ పై ములాయం ఆరేళ్లపాటు సస్పెండ్ వేటు వేశారు. దీంతో అఖిలేష్ అనుచరులు, సన్నిహితులు ఆందోళన చెందారు. అత్యవసరంగా అఖిలేష్ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి 229 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ తనకు బలం ఉందని నిరూపించుకోవడానికే ఈ సమావేశం అఖిలేష్ ఏర్పాటు చేశారు. అయితే ఈ సమావేశంలో మాత్రం యూపీని మళ్లీ గెల్చుకుని నాన్నకు కానుకగా ఇస్తానని చెప్పారు. తర్వాత అఖిలేష్ తండ్రి ములాయంతో భేటీ అయ్యారు. చివరకు అఖిలేష్, రాంగోపాల్ పై సస్పెన్షన్ ను ఎత్తివేస్తూ ములాయం నిర్ణయం తీసుకున్నారు.

Similar News